31-12-2024 12:00:00 AM
ఉదయాన్నే తీసుకునే అల్పాహారం ఎంతో ముఖ్యమైనది. బ్రేక్‌ఫాస్ట్ చేయడం వలన ఉదయాన్నే మన శరీరానికి కావాల్సిన ఎనర్జీ లభిస్తుంది. అయితే చాలా మంది బ్రేక్‌ఫాస్ట్ తినకపోవడం వలన కొన్ని ఆరోగ్య సమస్యలు రావచ్చు. ఉదయం సమయానికి బ్రేక్‌ఫాస్ట్ తినకపోవడం వల్ల మధ్యాహ్నం అతిగా తినాలనే కోరిక పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
శరీరానికి ఆహారం లేకపోవడం వల్ల త్వరగా అలసిపోవడం, నిద్రపోవాలనే కోరిక పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. బ్రేక్‌ఫాస్ట్ తినకపోవ డం వల్ల మధ్యాహ్నం అధిక కేలరీల ఆహారం తీసుకోవడం జరుగుతుంది. ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది. రక్తపోటు, కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగడం వంటి ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. బ్రేక్‌ఫాస్ట్ తీసుకోకపోతే మనం మరింత కోపంగా, చిరాకుగా ఉంటాము. అందుకే బ్రేక్‌ఫాస్ట్ కచ్చితంగా తినాలని చెబుతున్నారు డాక్టర్లు.