calender_icon.png 8 July, 2025 | 1:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగరేణి పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

24-06-2025 08:29:14 PM

మందమర్రి (విజయక్రాంతి): 2025-26 విద్యాసంవత్సరానికి గాను సిసిసి నస్పూర్ లోని సింగరేణి పాలిటెక్నిక్ కళాశాల(Singareni Polytechnic College)లో మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం విద్యార్థులు ధరఖాస్తు చేసుకోవాలని సింగరేణి ఏరియా పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్(Singareni Area Personnel Manager Shyamsunder) కోరారు. ఈమేరకు కొత్తగూడెం ఎడ్యుకేషనల్ సొసైటి నుండి మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేశారని ఆయన వివరించారు.

కళాశాలలో మొదటి సంవత్సరం సివిల్ కోర్సులో 60, ఎలక్ట్రికల్-ఎలక్ట్రానిక్స్-60, మెకానికల్-60, మైనింగ్-60 చొప్పున మొత్తం 300 సీట్లు  ఉన్నాయనీ, వీటిలో 150 సీట్లను సింగరేణి ఉద్యోగులు, మాజీ ఉద్యోగల పిల్లలకు, 150 సీట్లు ఇతరులకు కేటాయించడం జరుగు తుందన్నారు. సింగరేణి ఉద్యోగులు, మాజీ ఉద్యోగుల పిల్లలు జులై 3వ తేదీ లోపు సింగరేణి పాలిసెట్ వెబ్సైట్ ద్వారా(https://scp.scpolytechnic.com/online_admission), ఇతరులు తెలంగాణ పాలిసెట్ వెబ్సైట్ (https://tgpolycet.nic.in) ద్వారా ఈ నెల 24 నుంచి 28 వ తేదీలోపు ఆన్లైన్ లో ధరఖాస్తు చేసుకోవాలన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు 9010222161, 8790112515, 9491144168 నెంబర్లలో  సంప్రదించాలని సూచించారు.