25-04-2025 01:48:24 AM
హైదరాబాద్, ఏప్రిల్ 24 (విజయక్రాంతి): రాష్ట్రంలోని 239 తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 2025 26 విద్యాసంవత్సరానికి ఇంటర్‌లో ప్రవేశాలకు శుక్రవారం నుంచి దరఖాస్తులు స్వీకరించినున్నట్టు ఆ సంస్థ కార్యదర్శి అలగు వర్షిణి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులను చివరి తేదీ మే 15 వరకు ఆన్‌లైన్‌లో సమర్పించాలని ఆమె పేర్కొన్నారు.