12-08-2025 12:00:00 AM
కుమ్రం భీం ఆసిఫాబాద్, ఆగస్టు 11 (విజయక్రాంతి): న్యాయవాధి నరహరిపై సివిల్ కేసు విషయంలో కొంతమంది దుండగులు దాడిని నిరసిస్తూ సోమవారం ఆసిఫాబాద్, సిర్పూర్ కోర్టు న్యాయవాదులు విధులు బహిష్కరించారు.ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు మాట్లాడుతూ ఇటీవల అర్బన్ మండలంలో నరహరిపై జరిగిన దాడి విషయంలో ఎస్సై వ్యవహరించిన తీరు సరికాదని అన్నారు.
దాడి చేసి మరి ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని ఫిర్యా దు చేయడంతో విచారణ చేపట్టకుండానే ఎస్సై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయడం సరికాదన్నారు.ఏకపక్షంగా వ్యవహరించిన ఎస్సై పై ఉన్నతాధికారులు విచారణ చేపట్టి చర్య లు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షు లు రాపర్తి రవీందర్ శ్రీనివాస్ సీనియర్ న్యాయవాదులు సురేష్, సతీష్‌బాబు, ముక్తా సురేష్,కళ్యాణ్, రైస్ అహ్మద్, శంకర్, కిషోర్ కుమార్, శ్రీనివాస్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.