01-08-2025 07:11:58 PM
సూపర్వైజర్ పీవీ రమణ..
కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem District) సుజాతనగర్ లో తల్లి పాల వారోత్సవాలను వేపలగడ్డ గ్రామంలో శుక్రవారం ఐసీడీస్ కొత్తగూడెం అర్బన్ ప్రాజెక్టు సూపర్వైజర్, పీవీ రమణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 1 నుండి 7 వరకు, తల్లి పాల వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. స్థానిక ప్రజలకు దీనిపై అవగాహన నిమిత్తం ర్యాలీని గ్రామంలో నిర్వహించారు.
బిడ్డ పుట్టిన గంటలోపే ముర్రు పాలిచ్చేలా, తల్లికి సాయం చేయాలన్నదే వారోత్సవాల ఉద్దేశం అని, అమ్మపాలు అమృతం నవజాత శిశువు ఆరోగ్యంగా పెరగడానికి, తల్లిపాలు ఎంతగానో దోహదపడతాయి. ప్రకృతి సిద్ధంగా లభించే పాలు బిడ్డకు ఎంతో మేలు చేస్తాయి అన్నారు. తల్లి పాలల్లో పలు రకాల పోషకాలుంటాయని, శిశువు ఎదుగుదలకు ఉపకరిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు నిర్మల,శారద, కళావతి, పద్మ, మాధవి, సరస్వతి, అనిత, సరోజ, హేమలత, వీరమ్మ, రుక్మిణి, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.