10-09-2025 01:31:47 AM
తెలంగాణ కేబుల్ టీవీ ఇంటర్నెట్ టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్
ఖైరతాబాద్, సెప్టెంబర్ 9 (విజయక్రాంతి) : అనధికారంగా జరుగుతున్న కేబు ల్ కటింగ్స్‌ను వెంటనే ఆపాలని తెలంగాణ కేబుల్ టీవీ ఇంటర్నెట్ టెలికాం సర్వీస్ ప్రొ వైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (టి జి సి ఐ టి) ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేర కు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షుడు మిద్దెల జితేందర్, గౌరవ అధ్యక్షుడు రామకృష్ణలు మాట్లాడారు..
తెలంగా ణ వ్యాప్తంగా టీజీఎస్పీడీసీఎల్ అనధికారంగా కేబుల్ కట్ చేయడం వల్ల పౌరులు, వ్యాపారులు అత్యవసర సేవలు తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయన్నారు. గత మూడు దశాబ్దాలుగా కేబుల్ టీవీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు, టెలికాం ఆపరేటర్లు లక్షలాది గృహాలు, వ్యాపారాలకు సేవలు అందిస్తూ వినోదం, ఇంటర్నెట్ కనెక్టివిటీ ద్వారా జీవనశైలిలోనూ ఆర్థిక అభివృద్ధి లోను కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు.
ఈ రంగం ద్వారా జి ఎస్ టి, లైసెన్స్ ఫీజుల రూపంలో వందల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చి పెడుతుందని తెలిపారు. కేబుల్ కటింగ్ వల్ల ప్రజలు సంస్థ లు భారీగా నష్టపోతున్నాయని వర్క్ ఫ్రం హోం ఉద్యోగులు, రెసిడెన్షియల్ వినియోగదారులు, ఆస్పత్రులు, బ్యాంకింగ్ సేవలు, యూపీఐ పేమెంట్, రిజిస్ట్రేషన్లు ఆర్టిఏ వం టి ముఖ్య ప్రభుత్వ కార్యాలయాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు మహేష్, సత్యనారా యణ, జనరల్ సెక్రెటరీ మనోజ్ కుమార్, రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.