30-01-2026 12:00:00 AM
హైదరాబాద్, జనవరి 29(విజయక్రాంతి): నగరంలోని నిజాం కాలేజీలో తెలం గాణ రాజ్యాధికార విద్యార్థి సేన (టీఆర్‌వీఎస్) నూతన అధ్యక్ష ఉపాధ్యక్షుల నియామ కం జరిగింది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ(టీఆర్పీ) రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సూచన మేరకు టీఆర్‌వీఎస్ రాష్ట్ర ఇన్‌చార్జి ఎం.ఎల్. రాజు గౌడ్ ఆమోదంతో ఈ నియామకం జరిగింది. నిజాం కాలేజి టీఆర్‌వీఎస్ అధ్యక్షుడిగా సాయి కుమార్, ఉపాధ్యక్షుడిగా సురేష్ నియమితులయ్యా రు.
ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ, విద్యార్థుల హక్కులు, సమస్యల పరిష్కారం కోసం టీఆర్‌వీఎస్ మరింత బలంగా పని చేయాలని, తెలంగాణ రాజ్యాధికార ఉద్యమాన్ని విద్యార్థుల్లో విస్తృతంగా తీసుకెళ్లే బాధ్యత నూతన నాయకత్వంపై ఉం దని తెలిపారు.నూతనంగా నియమితులైన సాయి కుమార్, సురేష్‌లు పార్టీపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతలు అప్పగించిన పార్టీ అధినేత తీన్మార్ మల్లన్నకి, టీఆర్‌వీఎస్ రాష్ట్ర ఇన్‌చార్జి ఎంఎల్ రాజు గౌడ్‌కి కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థుల సమస్యలపై నిరంత రం పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.