calender_icon.png 30 January, 2026 | 7:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరా మహిళా శక్తి లబ్ధిదారులకు నాటుకోడి పిల్లల పంపిణీ

30-01-2026 12:00:00 AM

ఎర్రుపాలెం జనవరి 29 (విజయక్రాంతి): గురువారం ఎర్రుపాలెం మండలం కాచవరం గ్రామంలో ఇందిరా మహిళా శక్తి లో భాగంగా ఫామ్ నుంచి నాటుకోడి పిల్లలు 750 మంది లబ్ధిదారులు కు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిధిగా మధిర వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహరావు  మండల కాంగ్రెస్ అధ్యక్షులు వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు. మండల ఏపీఎం హరినారాయణ  మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో ప్రజాలకు పౌష్టిక ఆహారం అందించాలనే ఉద్దేశ్యం తో రాష్ట్రా ప్రభుత్వం ఈ నాటుకోడి పిల్లలు ను మహిళా సంఘ సభ్యులకు పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు.  సంఘ సభ్యులు ఈ అవకాశం ఉపయోగించుకోవాలని పేర్కొన్నారు. ఒక్కక్క కోడి పిల్ల 250 నుంచి 1 కేజీ వరకు ఉంటుందని పేర్కొన్నారు.

250 గ్రామల కోడిపిల్ల 140-150 రూపాయలు ,1 కేజీ కోడి పిల్ల 350 రూపాయలు కు ఇవ్వడం జరుగుతుంది. వీటిని సంఘ సభ్యులకు అప్పు గా ఇవ్వడం జరుగుతుంది. వాటిని వాయిదా ప్రకారం చెల్లించాలని పేర్కొన్నారు. కోడి పిల్ల పెద్దది అయ్యాక సవత్సరానికి 120-140 కోడి గ్రుడ్లు పెడతాయి. ఒక్కక్క గ్రుడ్డు 18 రూపాయలు చొప్పున మహిళా మారట్స్ లో కొనుగోలు చేయడం అని పేర్కొన్నారు. కేజీ మాంసం 650 ఉంటుంది. ఇలా ఎంతో లాభందయాకము గా ఉంటుంది. అని వివరించారు. ఈ కార్యక్రమం లో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, మరియు వెంకటాపురం గ్రామ సర్పంచ్ బొగ్గుల గోవర్ధన్ రెడ్డి, లక్ష్మిపురం సర్పంచ్ నాగిరెడ్డి, సుధాకర్ రెడ్డి, సీసీ లు, వివో లు, గ్రామ పెద్దలు పాల్గొనడం జరిగింది.