calender_icon.png 30 January, 2026 | 4:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగరేణికి బీకన్ ఆఫ్ హోప్ అవార్డు

30-01-2026 12:00:00 AM

సీఎస్‌ఆర్ పనులకు గుర్తింపుగా..

భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 29 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యధిక సీఎస్‌ఆర్ పనులు చేసినందుకు కలెక్టర్ బీకాన్ ఆఫ్ హోమ్ అవార్డును అందజే శారు. ఐదేళ్లలో రూ.15 కోట్లకు పైగా సీఎస్‌ఆర్ నిధులతో గ్రామాభివృద్ధి కార్యక్రమాల కు చేయూతకు గుర్తింపుగా అందజేశారు. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ భద్రాద్రి జిల్లాలోని పట్టణాలు, గిరిజన గ్రామాల్లో చేపట్టిన సీఎస్‌ఆర్ పనులకు ప్రశంసగా ఈ అవార్డును పొందింది. ఇటీవల భద్రాచలం ట్రైబల్ భవన్‌లో జరిగిన సీఎస్‌ఆర్ సమ్మిట్ లో జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఈ అవార్డును సింగరేణి సంస్థ జనరల్ మేనేజర్ వెల్ఫేర్ అండ్ సీఎస్‌ఆర్ జీ వెంకటకిరణ్ కుమార్‌కు, సీఎస్‌ఆర్ అధికారి గట్టు స్వామి కి అందజేశారు.