14-12-2025 12:12:02 AM
దివ్యాంగురాలైనా అంతర్జాతీయ క్రీడల్లో రాణిస్తున్న ఉద్యోగిని
ఒలంపిక్ పోటీల్లో పాల్గొనాలన్నదే తన ఆశయం: అర్చన
రాజన్న సిరిసిల్ల, డిసెంబర్ 13(విజయక్రాం తి): ఒలంపిక్ క్రీడల్లో అవకాశం దక్కించుకోవాలన్న తపనతో ముందుకు సాగుతున్నానని అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొని గోల్ మెడల్ సాధించిన దివ్యాంగుల వాలీబాల్ క్రీడాకారిణి మిట్టపల్లి అర్చన పేర్కొన్నారు. శ్రీలంకలో ఈనెల 6, 7 తేదీల్లో జరిగిన ‘ఫస్ట్ సౌత్ ఆసియన్ పారా త్రో బాల్ ఛాంపియన్‌షిప్ మెన్ అండ్ ఉమెన్’ టోర్నీలో పాల్గొని గోల్ మెడల్‌తో శనివారం సిరిసిల్లకు చేరిన అర్చనను సిరిసిల్ల వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు.
ప్రస్తుతం సిరిసిల్ల స్త్రీ శిశు సంక్షేమ వయోవృద్ధుల దివ్యాంగుల శాఖలో ‘మల్టీ టాస్క్‘ విభాగంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగంలో విధులు నిర్వహిస్తున్న అర్చన పారా గేమ్స్‌లో గ్రామీణ స్థాయి నుంచి జిల్లా, రాష్ట్రస్థాయిలో ఎంపికై జాతీయస్థాయికి ఎదిగారు. అక్కడినుంచి అంతర్జాతీయ సాయి క్రీడల్లో అవకాశం దక్కించుకున్నారు. అర్చనను తమ శాఖ ఆధ్వర్యంలో శ్రీలంక లో జరిగిన ఛాంపియన్ షిప్ పోటీలకు ప్రభుత్వం పంపిం ది.
ఏడుగురు క్రీడాకారుల జట్టుతో శ్రీలంకలో జరిగిన అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొని ‘డిప్లమా ఆఫ్ అచీవ్‌మెంట్’అవార్డుతో బంగారు పతకం సాధించారు. తన కోచ్ సాయి అందించిన మెలకువలతో విజయం సాధించినట్లు అర్చన పేర్కొన్నారు. స్పాన్సర్స్ దొరికితే ఒలంపిక్స్ క్రీడల్లో పాల్గొనేందుకు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో సిరిసిల్ల వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు శాంతి ప్రకాష్ శుక్ల వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు శాంతి ప్రకాష్ శుక్ల, రాధాబాయి మహిళా మండలి అధ్యక్షురాలు, విశ్రాంత ఉపన్యాసకులు ఝాన్సీ శుక్ల, ఎల్లే సువర్ణ తదితరులు పాల్గొన్నారు.