calender_icon.png 9 July, 2025 | 6:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డ్రీమ్ లైనర్ విమానాలు సురక్షితమే

09-07-2025 12:57:47 AM

స్పష్టం చేసిన ఎయిరిండియా

ముంబై, జూలై 8: అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఆరోజు కుప్పకూలిన బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానం మోడల్ సురక్షితమైనదేనని ఎయిరిండియా వెల్లడించింది. ఆ మోడల్‌కు చెందినవి వెయ్యికి పైగా విమానాలు నడుస్తున్నాయని పేర్కొంది. విమాన ప్రమాదం నేపథ్యంలో పార్లమెంటరీ ప్యానెల్ ముందు ఎయిరిండియా ప్రతినిధులు హాజరై విషయాలు వెల్లడించారు.

ఈ ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని, అధికారిక దర్యాప్తు  నివేదిక కోసం వేచిచూస్తున్నాయని చెప్పారు. మీటింగ్‌లో ఎయిరిండియా సీఈఓ విల్సన్ క్యాంప్‌బెల్, పౌర విమానయాన శాఖ, డీజీసీఏ, ఎయిర్‌ఫోర్స్ ఎకనామిక్ రెగ్యులేటరి అథారిటీ, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్‌కు చెందిన ఉన్నతాధికారులు, ఇండిగో అధికారులు హాజరయ్యారు.

కాగా అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనపై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) దర్యాప్తు కొనసాగుతోంది. ప్రమాదంపై ఇప్పటివరకు జరిపిన విశ్లేషణ, దర్యాప్తు ఆధారంగా ఏఏఐబీ ప్రాథమిక నివేదిక రూపొందించింది.