31-01-2026 12:00:00 AM
సికింద్రాబాద్, జనవరి 30 (విజయక్రాంతి): సికింద్రాబాద్ మహంకాళి ఏసీపీగా బదిలీపై వచ్చిన సిహెచ్. శ్రీధర్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.అంతకుముందు యాంటీ నార్కోటిక్ బ్యూరో లో డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న ఆయన ను మహంకాళి ఏసీపీగా బదిలీపై వచ్చారు. గతంలో ఇక్కడ ఏసీపీగా పనిచేసిన సైదయ్యపై ఆరోపణలు రావడంతో ఇక్కడి నుంచి సీపీ కార్యాలయానికి ఆటాచ్ చేశారు.ఈ సందర్భంగా సిహెచ్ శ్రీధర్ మాట్లాడుతూ శాంతి భద్రతలు పర్యవేక్షించేందుకు ప్రతి ఒక్కరూ పోలీసులతో కలిసి రావాలని మహంకాళి ఏసీపీ సిహెచ్ శ్రీధర్ సూచించారు.