calender_icon.png 9 August, 2025 | 7:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజలకు నమ్మకం కలిగించాలి-

09-08-2025 12:04:02 AM

ఖమ్మం, ఆగస్టు 08 (విజయ క్రాంతి): ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజలకు నమ్మకం కలిగించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. జిల్లా ప్రధాన ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన శుక్రవారం హాస్పిటల్ డెవల ప్మెంట్ సొసైటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సుడా క్రింద జిల్లా ఆసుపత్రిలో 13 అభివృద్ధి పనులు 25 కోట్ల రూపాయలతో చేపట్టామని అన్నారు. 23 కోట్ల 75 లక్షలతో చేపట్టిన 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ పెండింగ్ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అన్నారు.

తక్కువ ఖర్చుతో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఉపయోగపడే యంత్రాల కొనుగోలు, ఇతర సౌకర్యాల కల్పనకు ప్రతిపాదనలు అందించాలని, అవసరమైన నిధులను తప్పనిసరిగా మంజూరు చేస్తామని కలెక్టర్ తెలిపారు. ఖమ్మం ఆసుపత్రి నందు పేషెంట్లకు ఉపయోగపడే విధంగా టాయిలెట్స్ మరమ్మత్తు పనులను వేగంగా పూర్తి చేయాలని అన్నారు. జిల్లా ఆసుపత్రిలోని వివిధ విభాగాల్లో అందుబాటులో ఉన్న యంత్రాలు, వాటి ప్రస్తుత స్థితి గతులపై రిపోర్ట్ తయారు చేయాలని, మరమ్మత్తుకు గురైన యంత్రాలను బాగు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.

ఆసుపత్రికి అవసరమైన ఇన్ ఫ్రా సౌకర్యాలపై ప్రభుత్వానికి నివేదిక అందించాలని అన్నారు. ఈ సమావేశంలో ఖమ్మం నగరపాలక సంస్థ కమీషనర్ అభిషేక్ అగస్త్య, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. ఎం. నరేందర్, జిల్లా వైద్య ఆరోగ్య అధికారిణి డా. కళావతి బాయి, డిసిహెచ్‌ఎస్ డా. రాజశేఖర్, వైద్యలు వివిధ విభాగాల అధిపతులు, వైద్య శాఖ ఇఇ ఉమామహేశ్వరరావు, వై ద్య అధికారులు, తదితరులు పాల్గొన్నారు.