calender_icon.png 9 August, 2025 | 7:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్, బీజేపీ నాయకుల వైఖరి శవాలపై పేలాలు ఏరుకున్నట్టుంది

09-08-2025 12:00:00 AM

- ఈ ప్రభుత్వం పేదల పక్షపాతి,ఎవ్వరికీ ఇబ్బందులు కలుగనీయం 

- కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన డ్యామ్ సేఫ్టీ ఆక్ట్ 2021 ప్రకారం నోటీసులు జారీ చేశారు 

- హస్నాపురం కాలనీ,బతుకమ్మ కాలనీ సందర్శించి వారికి పూర్తి భరోసా కల్పించిన సుడా చైర్మన్ కోమటిరెడ్డి

కరీంనగర్, ఆగస్టు 8 (వికాయక్రాంతి): మానేర్ డ్యామ్ కట్ట దగ్గర్లోని హస్నాపురం కాల నీ మరియు బతుకమ్మ కాలనీ ప్రాంతాలను సుడా చైర్మన్ సందర్శించి వాస్తవాలను వా రికి తెలియజేసి వారికి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ గతంలో ప్రాజెక్టుల భద్రతకు సంబం ధించి నిబంధనలు ఉన్నప్పటికీ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం 2021 సంవత్సరంలో డ్యా మ్ సేఫ్టీ ఆక్ట్ తీసుకురావడం వల్ల నిబంధనలు కఠినతరం చేశారని దానిలో భాగంగా నే సెంట్రల్ వాటర్ కమిషన్ డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానెల్ ఏర్పాటు చేసి వారి ద్వారా పరిశీలన చేపించి 200 మీటర్ల లోపల ని ర్మాణం చేసుకున్న వారికి ఇరిగేషన్ అధికారుల ద్వారా నోటీసులు జారీ చేయడం జరి గిందని ఇదేదో రాష్ట్ర ప్రభుత్వం కావాలని చే సినట్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేయాల ని చూస్తున్న బిఆర్‌ఎస్,బిజెపి నాయకుల వైఖరి శవాల మీద పేలాలు ఏరుకున్నట్టున్నదని నరేందర్ రెడ్డి మండిపడ్డారు.

అన్నీ తెలిసి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హైడ్రా,కాడ్రా అని బుల్డోజర్లు ఆపుతామని ఏదో జరిగిపోతున్నట్టు మాట్లాడుతున్నాడని నరేందర్ రెడ్డి మండిపడ్డారు.భూసేకరణ జరిగిన క్రమంలో ఆయా సర్వే నంబర్లలో మిగిలిన కొంత భూ మికి ఎన్వోసి తీసుకొని భూసేకరణ జరిగిన భూమిని కూడా అమ్ముకున్న వారిని బయటకు లాగుతామని దానికి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సహకరించాలని నరేందర్ రెడ్డి అన్నారు.ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు ఎ క్కడా అన్యాయం జరుగదని గత బిఆర్‌ఎస్ ప్రభుత్వంలాగా డబుల్ బెడ్రూం ఇండ్లు ఇ స్తామని మోసం చేసినట్టు కాదనీ నియోజకవర్గానికి ఏడాదికి 3500 ఇండ్లిచ్చి పేదలను ఆదుకొనే ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు.ఎండి తా జ్,శ్రవణ్ నాయక్,గుండాటి శ్రీనివాస్ రెడ్డి,   కాంగ్రెస్ నాయకులుపాల్గొన్నారు.