12-05-2025 03:07:27 AM
కరీంనగర్ క్రైం మే11(విజయక్రాంతి):, కరీంనగర్ లోని జ్యోతి నగర్ ఆదివారం జీనియస్ చెస్ అకాడమీలో నిర్వహించిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఓపెన్ మరియు అండర్ 15 విభాగంలో నిర్వహించిన చదరంగం పోటీలకు విశేష స్పందన లభించింది. దాదాపు 100 మంది క్రీడాకారుల పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీనియర్ చార్టెడ్ అకౌంటెంట్ రమణ మూర్తి పాల్గొని చదరంగంతో మేధాశక్తి ఏకాగ్రత పెరుగుతుందని అన్నారు.
జీనియస్ చెస్ అకాడమీ వ్యవస్థాపకులు కంకటి కనకయ్య మాట్లాడుతూ చదరంగం క్రీడాకారుల ప్రతిభను వెలికి తీసే అందుకే ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరిగిందని పాల్గొన్న గెలుపొందిన క్రీడాకారులకు నగదు బహుమతితో పాటు మెమొంటోలు అందజేయడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో న్యూరో ఫిజీషియన్ డాక్టర్ వెంకట్ జీనియస్ చెస్ అకాడమీ డైరెక్టర్ కంకటి అనూప్ కుమార్ సృజన్ కుమార్ తాటిపల్లి సతీష్ బాబు చీఫ్ ఆర్బిటర్ అరుణ్ ఆర్బిటర్స్ రేవిక్ నితిన్ ప్రభుచంద్ర వరుణ్ అభిరామ్ శ్రీ నిజ స్వాతి చదరంగం క్రీడాకారులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.