calender_icon.png 11 January, 2026 | 4:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేట కలెక్టర్‌పై రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయా?

10-01-2026 01:20:13 AM

  1. గత నెల 17 నుంచి ఈనెల 10వ తేదీ వరకు సెలవుల్లోనే

కలెక్టర్, జాయిన్ అయ్యే అవకాశం ఉందా!లేదా!

సందేహం వ్యక్తం చేస్తున్న నారాయణపేట జిల్లా ప్రజలు

ఇందిరమ్మ బిల్లులతో పాటు పలు బిల్లుల మంజూరు మోక్షం లభించేనా? 

మంత్రి, ఎమ్మెల్యే, చొరవ తీసుకొని కలెక్టర్‌ను విధుల్లో చేరేటట్లు ప్రజల వేడుకోలు

నారాయణ పేట, జనవరి 9 (విజయక్రాంతి): అసలైన కారణాలు తెలియదు కానీ జిల్లా కలెక్టర్ రోజుల తరబడి వరస సెలవులతో వెళ్లడంతో జిల్లా వ్యాప్తంగా ఒకటే చర్చ జరుగుతుంది. రాజకీయ ఒత్తిళ్లతోనే జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ దూరపు సెలవులు పెట్టి వెళ్లడమే ఈ చర్చకు బలం చేకూరుతుంది. గత నెల 17వ తేదీ నుంచి ఈ నెల 10వ తేదీ వరకు నారాయణపేట జిల్లా కలెక్టర్ సిద్దపట్నాయక్ సెలవుల్లో ఉన్నారు.

దీంతో నారాయణపేట జిల్లా అదనపు కలెక్టర్ సంచిత్ గాంగ్వార్ కు ఇంచార్జి కలెక్టర్గా ప్రభుత్వం బాధ్యతలు అప్పగించించగా ఆయన కూడా ఇటీవల ప్రభుత్వం చేసిన బదిలీలో భాగంగా ఆయన్ను ప్రభుత్వం జీ హెచ్ ఎం సి కి బదిలీ చేయటంతో   వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్ కు ప్రభుత్వం అదనపు బాధ్యతలను అప్పగించింది.  ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇళ్లకు సంభందించిన బిల్లులు రెండు జిల్లా లకు సంబంధించిన బిల్లులు ఒకే కలెక్టర్ సంతకం చేయటానికి గాను రాక పోవటంతో ఆయన  ఇందిరమ్మ ఇళ్లకు సంభందించిన బిల్లులు చేయనట్టు తెలుస్తుంది.

దీంతో రెగ్యులర్గా ఉన్న కలెక్టర్ సిక్త పట్నాయక్ అసలు జిల్లాకు వస్తుందా రాదా అనే సందేహం నెలకొంది .కలెక్టర్ సిక్తా పట్నాయక్ దూరపు సెలవుల్లో వెళ్లడంతో రాజకీయ ఒత్తిల్లె ప్రధాన కారణంగా ఉన్నందున ఇక్కడి నుంచి వెళ్లేందుకే లాంగ్ లీవ్ అంటూ వెళ్లడం జరిగిందని జిల్లాల్లో చర్చ జరుగుతుంది.

 ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలోనే కలెక్టర్ లేకపోవడంతో ఆగిన బిల్లులు..

కొన్ని ముఖ్యమైన బిల్లులు మంజూరు విషయంలో జిల్లా కలెక్టర్  దూరపు సెలవులలో  ఉండడంతో  మంజూరు కావలసిన కొన్ని కీలక బిల్లులు కూడా మంజూరు కావడంలేదని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. స్తానిక మంత్రి, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేపర్ణికా రెడ్డి,ఈ విషయంపై పూర్తిస్థాయిలో చొరవ తీసుకొని జిల్లా కలెక్టర్ ని తిరిగి విధుల్లో చేరేందుకు అవసరమైన చొరవ చూపించాల్సిన అవసరం ఉందని ప్రజలు చెబుతున్న మాట. ఇందిరమ్మ ఇల్లులతో పాటు వివిధ బిల్లుల విషయంలో కూడా మంజూరు కావడంలేదని పలువురు పేర్కొంటున్నారు.