calender_icon.png 24 September, 2025 | 4:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గట్టుప్పల్ చౌరస్తాలో చర్చకు సిద్ధమా?

24-09-2025 12:00:00 AM

-మేము చేసిన అభివృద్ధి ఏంటో చూపిస్తా.. 

మీరు చేసింది ఏందో చూపించాలి..

-చండూర్ మాజీ జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం

మునుగోడు (గట్టుప్పల్), సెప్టెంబర్ 23 (విజయక్రాంతి) : గట్టుపల్ మండలంలో మేము చేసిన అభివృద్ధి ఏమిటో లిఖితపూర్వకంగా చూపిస్తాను.. మీరు చేసిన అభివృద్ధి ఏదో చూపించాలని గట్టుపల్ చౌరస్తాలో చర్చకు సిద్ధమాఅని చండూర్ మాజీ జెడ్పిటిసి కర్నాటి వెంకటేశం అన్నారు. గట్టుప్పల్ మండలంలో జరిగిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలు మౌలిక వసతుల్లో నా పాత్ర లేకుంటే ముక్కు నేలకు రాస్తానని ప్రతిపక్ష పార్టీకి సవాలు విసిరారు.

మంగళవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత బి ఆర్ ఎస్ హయాంలో మంజూరైన పనులే తప్ప కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపుగా రెండు సంవత్సరాలు కావస్తున్న ఒక్క పని కూడా చేయలేదని తెలవని సోయినయి సోయిలేని కాంగ్రెస్ నాయకులు ఉన్నారనివిమర్శించారు.మంజూరైన పనులను రద్దుచేసి మండల అభివృద్ధి విషయంలో వెనుకకు నెట్టారన్నారు.

సబ్ సెంటర్కు మరో 20 లక్షల రూపాయలు, వాయులపల్లి నుండి గట్టుప్పల్ వరకు బిటి రోడ్డు నిర్మాణానికి 3 కోట్ల 50 లక్షలు రూపాయలు మంజూరు చేసి ప్రోసిడెంట్ తెప్పించమన్నారు. ఎన్నో ఆటంకాలని ఎదుర్కొని మంజూరు చేయించిన రోడ్డును కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిందని మండిపడ్డారు. అంతంపేట నుండి గట్టుప్పల్ రోడ్డు నిర్మాణం, గట్టుప్పల్ నుండి పుట్టపాక వరకు బీటి రోడ్డు రెన్యూవల్ సిఆర్‌ఎఫ్ ద్వారా 30 కోట్ల మంజూరు.

గట్టుప్పల్ నుండి లచ్చమ్మ గూడెం వరకు డబ్బులు రోడ్డు నిర్మాణం మంజూరు చేపిస్తే ఈఎంసి దగ్గర పెండింగ్లో ఉందన్నారు. మాజీ వైస్ ఎంపీపీ అవ్వారి శ్రీనివాస్, గొరిగె సత్తయ్య ఎంపిటిసి కర్నాటి అశోక్ , పోరెడ్డి ముత్తారెడ్డి,తోటకూర శంకర్,ఐతరాజు హనుమంతు, అంజయ్య, కిషోర్, కృష్ణయ్య, ఘాశీరాం, శ్రీనివాస్, అమరేందర్, అబ్బయ్య ఉన్నారు.