calender_icon.png 24 September, 2025 | 4:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూనివర్సిటీలో బతుకమ్మ ఆటా.. పాట..

24-09-2025 12:00:00 AM

నల్లగొండ రూరల్, సెప్టెంబర్ 23 : మహాత్మా గాంధీ యూనివర్సిటీ లో ఏబీవీపీ ఆధ్వర్యంలో మంగళవారం బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. బతుకమ్మ ఆటపాటలతో యూనివర్సిటీలో ఆధ్యాత్మిక చింతన నెలకొన్నది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యులు జీవన్ మాట్లాడుతూ బతుకమ్మ ప్రత్యేకతలు, తెలంగాణ సాంస్కృతిక వారసత్వం, మహిళా శక్తి ప్రతీకగా విశదీకరించారు.

తెలంగాణ ఆడపడుచులు దేవతా స్వరూపిణులుగా భావించి కుటుంబ శ్రేయస్సు, సుఖశాంతి, ఆయురారోగ్యాలు కోరుకుంటూ ఈ వేడుకను నిర్వహిస్తారని తెలిపారు.బతుకమ్మ పూల పండుగ మాత్రమే కాకుండా, తెలంగాణ జాతి సాంస్కృతిక గుర్తింపుగా నిలిచిందన్నారు. కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర జాయింట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ విశ్ణు , నల్గొండ విభాగ్ ప్రముఖ్ ప్రమోద్ , రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఛత్రపతియూనివర్సిటీ అధ్యక్షుడు హనుమాన్, కార్యదర్శి మోహన్, ప్రత్యూష, వెంకటేష్, విజయ్, సాయి, మౌనేష్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.