07-05-2025 12:46:37 AM
- నాగోల్ సాయినగర్ కాలనీలో భారీ అగ్ని ప్రమాదం
- బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
ఎల్బీనగర్, మే 6 : నాగోల్ డివిజన్ పరిధి లోని లక్కీ హోటల్ రెస్టారెంట్ వెనుక ప్రాంతంలో ఉన్న సాయి నగర్ గుడిసెల్లో గ్యాస్ సిలిండర్ పేలి మంగళవారం భారీ అగ్రి ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో భారీ ఆస్తి నష్టం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.
గంటన్నర పాటు అగ్నిమాపక సిబ్బంది శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. మ ప్రమాదంలో సుమారు 15 గుడిసెలు మంటలకు దగ్ధమైనట్లు, మరో 10 గుడిసెలు పాక్షికంగా దగ్ధమైనట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ ప్రమాదంలో అనేక మంది పేదలు నిరాశ్రయులయ్యారు. సామగ్రి, వంట వస్తువులు, దుస్తులు, నగదు, విలువైన పత్రాలు కాలిపోవడంతో బాధితులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. బాధితులను ఆదుకుంటామని అధికారులు, ప్రజాప్రతినిధులు హామీ ఇచ్చారు. పదమూడేండ్ల క్రితం ఇలాగే అగ్నిప్రమాదం జరిగిందని.. ఇప్పుడు మళ్ళీ జరిగిందంటున్న స్థానికులు చెబుతున్నారు.
- బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
నాగోల్ డివిజన్ లోని సాయినగర్ కాలనీలో మంగళవారం గుడిసెల్లో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వెంటనే అధికారులతో కలిసి బాధితులను పరామర్శించారు. నిర్వాసితులకు ఆర్థిక అవసరాల కోసం రూ, 50వేలు, రూ, 10 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అండగా ఉంటామని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి హామీ ఇచ్చారు.