calender_icon.png 17 November, 2025 | 2:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్వార్టర్ ఫైనల్లో అర్జున్

16-11-2025 12:00:00 AM

పనాజీ, నవంబర్ 15 : గోవాలోని పనా జీ వేదికగా జరుగుతున్న చెస్ ప్రపంచకప్‌లో భారత స్టార్ ప్లేయర్, తెలుగుతేజం అర్జున్ ఎరిగైసి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు. ఆసక్తికరంగా సాగిన ప్రీక్వార్టర్స్ మ్యాచ్‌లో రెండో సీడ్ అర్జున్ అమెరికాకు చెందిన లెవోన్ అరోనియన్‌పై విజయం సాధించాడు.

క్వార్టర్ ఫైనల్లో ఏడో సీడ్ చైనా ప్లేయర్ వి యితో తలపడనున్నాడు. మరో ప్లేయర్ హరికృష్ణ టై బ్రేక్ ఆడనున్నాడు. ప్రీక్వార్టర్స్‌లో మ్యాచ్ డ్రాగా ముగియడంతో టైబ్రేక్ తప్పడం లేదు. గుకేశ్, ప్రజ్ఞానంద ఇప్పటికే ఇంటిదారి పట్టగా, అర్జున్ ఎరిగైసి, హరికృష్ణ మాత్రమే టైటిల్‌పై ఆశలు రేపుతున్నారు.