24-08-2025 01:35:29 AM
ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మరో కుర్ర హీరో తెరంగేట్రం చేయనున్న సంగతి తెలిసిందే. మహేశ్‌బాబు అన్న రమేశ్‌బాబు కుమారుడు జయకృష్ణ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతు న్నాడు. ‘ఆర్‌ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి.. జయకృష్ణను లాంచ్ చేస్తున్నా డట. ఇప్ప టికే ఈ ప్రాజెక్టు ప్రీప్రొడక్షన్ పనులు మొదల య్యాయట. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, వైజయం తి మూవీస్ సంయుక్తంగా నిర్మించనున్నాయి.
అప్పట్లో తన గ్లామర్, డాన్సిం గ్ స్టుల్, యాక్టింగ్‌తో తెలుగు ప్రేక్షకుల హృదయా లను కొల్లగొట్టిన రవీనా టాండన్ కూతు రు రషా తడానీ.. జయకృష్ణ హీరో యిన్‌గా నటిస్తోందట. ఇందుకు సంబం ధించిన వార్తలు ఇప్పుడు అటు బాలీవుడ్, ఇటు టాలీ వుడ్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. అ యితే, రషా తడానీ కొద్ది రోజుల క్రితం నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ జోడీగా నటిస్తుందని వార్తలు వచ్చాయి. ఏమైందో తెలియదు కానీ, ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది.
అలా రషా తడానీ టాలీవుడ్ ఎంట్రీకి చెక్ పడింది. అలా మిస్ చేసుకున్న యంగ్ బ్యూటీ ఇప్పుడు సూపర్ స్టార్ వారసుడి సినిమాతో తెలు గు చిత్రసీమలో అడుగుపెట్టేం దుకు సిద్దమవుతోంది. రషా తడానీ బాలీ వుడ్‌లో ఇటీవల ‘ఆజాద్’ సినిమాతో హిందీ చిత్రసీమకు పరిచయమైంది. ఆ సినిమాలో ఈ భామ.. అజయ్ దేవగన్ మేనల్లుడు అమన్ దేవగన్ జోడీ కట్టింది. గ్లామర్, డాన్సింగ్ స్కిల్స్‌తో కుర్రకారును ఫిదా చేయడం ద్వారా మొదటి సినిమా తోనే తల్లికి తగ్గ తనయ అనిపిం చుకుంది.