07-05-2025 12:00:00 AM
బాల్కొండ మే 6(విజయ క్రాంతి) :నిజమాబాద్ జిల్లా బాల్కొండ లో 523 సంవత్సర కాల క్రితం కొలువై ఉన్న శ్రీ నిమిషాoభ ఆలయంలో వైశాఖ మాసం దశమిరోజు దేవి జన్మదినన్ని పునాష్కరించుకొని ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ పూజారి బి. కృష్ణ రావు జోషి తెలిపారు.
బుధవారం ఉదయం 8:00 అమ్మవారికి అభిషేకం,లక్ష్మి గణపతి, చండి హోమం అనంతరo మహా హారతి ఉంటుందని, అనంతరం మహిళా మణులచే ఒడి బియ్యాలు ఉంటాయని అలాగే పూజాల అనంతరం అమెరికాలో ఉంటున్న అనంతపురానికి చెందిన భారద్వాజస గోత్రానికి చెందిన సి. రిటైర్డ్ ప్రిన్సిపాల్, ఎల్. యన్. ప్రసాద్, రాజ్యలక్ష్మి, శ్రీహర్ష దీపిక, డా. గౌతమ్,భార్గవి, చైతన్య కృష్ణ, మనమరాళ్లు, కృతి,ఆద్య, మనవడు: ఆశ్రీత్ కుటుంబం వారిచే భక్తులందరికి అన్నదానం చేస్తున్నారని ఆలయ సేవకులు బి. ఆర్. నర్సింగ్ రావు తెలిపారు.
ఇది ఇలా ఉండగా ఈ ఆలయంలో 2018 ఏప్రిల్ నుండి ప్రతినెల మొదటి శుక్రవారం అన్న దానం జరుగుతూ ఉండటం విశేషం. అలాగే ఆగస్ట్ నెల నుండీ అన్నదానానికి ఖాళీలు ఉన్నాయని అన్నదానం చేసే వారు వెంటనే టోకెన్ నుంబర్ తీసుకొని పేర్లు మీ కుటుంబం గ్రూవ్ ఫోటో పంపాలని ఆలయ సేవకులు విజ్ఞప్తి చేశారు.