07-05-2025 12:00:00 AM
కార్పొరేటర్ అర్చన జయప్రకాశ్
హైదరాబాద్, మే 6 (విజయక్రాంతి): ఓఎంసీ కేసులో మొదటి నుంచి న్యాయపోరాటం సాగించిన మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి నిర్దోషిగా సీబీఐ ప్రత్యేక కోర్టు తేల్చిచెప్పడం పట్ల రాజేంద్రనగర్ కార్పొరేటర్ అర్చన జయప్రకాశ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె స్పందిస్తూ ‘సబిత ఇంద్రారెడ్డి.. ప్రజల కోసం జీవితాన్ని అర్పించిన నాయకురాలు.
ఆమెపై వచ్చిన అనవసర ఆరోపణలకు న్యాయం తుది ముద్ర వేసింది. ప్రజలపక్షాన నిలిచే ఆమెలాంటి నాయ కురాలు తెలంగాణలో అరుదు. ఈ తీర్పుతో న్యాయవస్థపై విశ్వాసం మరింత బలపడింది’ అని పేర్కొన్నారు. కాగా రాజేంద్రనగర్ ప్రాంతంలో సబితా ఇంద్రారెడ్డి అభిమానులు, కార్యకర్తలు మిఠాయిలు పంచుకుంటూ, ఆత్మీయంగా వేడుకలు జరుపుకున్నారు.