calender_icon.png 8 May, 2025 | 12:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పర్యవేక్షణ

07-05-2025 12:00:00 AM

ఎల్లారెడ్డి, మే 6: ఎల్లారెడ్డి  మండల కేంద్రంలోని, మాత్తమాల,ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అందుతున్న సేవలు,సౌకర్యాలపై కాయాకల్ప బృందం సందర్శించింది. మంగళవారం మండల కేంద్రంలోని ప్రాథమిక  ఆరోగ్య కేంద్రంలో,ఆరోగ్య ఉపకేంద్రం లో నిర్వహణ వ్యవస్థ యొక్క ఉన్నత ప్రమాణాలను బృందం ప్రశంసించింది.

వారి సందర్శన సమయంలో, కయాకల్ప్ బృందానికి డాక్టర్,మత్తమల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు,శరత్ కుమార్,మరియు సిబ్బంది అక్కడ అందుతున్న సేవల గురించి వివరించారు.కాయకల్ప బృందం సంబంధిత డాక్యుమెంటేషన్ ప్రక్రియలను నిశితంగా సమీక్షించారు. ఆసుపత్రిని భౌతికంగా తనిఖీ చేసి.. సిబ్బంది, రోగులతో సంభాషించారు.

అసెస్మెంట్ బృందం ఆసుపత్రి పనితీరు పట్ల సంతృప్తిని వ్యక్తం చేసింది. ముఖ్యంగా ఉన్నత నిర్వహణ ప్రమాణాలను పాటించినందుకు బృందం వారు ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రజారోగ్య సౌకర్యాలలో పరిశుభ్రత, , వ్యర్థాల నిర్వహణ ,ఇన్ఫెక్షన్ నియంత్రణ పద్ధతులను మెరుగుపరచడం,

ప్రోత్సహించడం అనే లక్ష్యంతో, స్వచ్ఛ భారత్ మిషన్ పొడిగింపు అయిన కయాకల్ప్ అవార్డు పథకాన్ని మే15, 2015న ప్రారంభించారన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు,కాయకల్ప,ప్రత్యేక అధికారి,పద్మజ,వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.