17-09-2025 12:52:53 AM
కలెక్టర్ దివాకర టీ.ఎస్
ములుగు, సెప్టెంబరు16(విజయక్రాంతి): ప్రజా పాలన దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అన్నారు. సెప్టెంబర్ 17 తేదీ కలెక్టరేట్ కార్యాలయం ఆవరణలో జరగనున్న ప్రజా పాలన దినోత్సవ వేడుకల మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసామని మంగళవారం జిల్లా కలెక్టర్ దివాకర టీ.ఎస్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సెప్టెంబర్17వ తేదీ ఉదయం అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. పండుగ వాతావరణంలో ప్రజా పాలన దినోత్సవం ఘనంగా జరుపుకోవాలని గ్రామపంచాయతీలలో ప్రత్యేక అధికారులు జాతీయ పతాకాన్ని ఆవిషరించాలని సూచించారు