17-09-2025 12:51:42 AM
జనగామ, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశం మందిరంలో జిల్లా ఉమ్మడి పరీక్షల విభాగం (ౄCEB) ఆధ్వర్యంలో ఎస్.ఎ1 ప్రశ్నాపత్రాల తయారీతో పాటు ధృవీకరణ, నిర్ధారణ విషయమై సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా విద్యా శాఖాధికారి & అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పింకేష్ కుమార్ మాట్లాడుతూ.. ప్రశ్నాపత్రాల రూపకల్పనలో ఖచ్చితత్వం పాటించాలని, పాఠ్యాంశాల సంపూర్ణత, విద్యార్థుల స్థాయికి తగిన కఠినత ఉండాలని సూచించారు. రహస్యత అత్యంత ముఖ్యమన్నారు. ప్రశ్నాపత్రాల ముసాయిదా, ముద్రణ , పంపిణీ వంటి ప్రక్రియలో పూర్తిగా గోప్యత అత్యంత అవసరం అన్నారు.
ప్రాథమిక స్థాయిలో (1వ తరగతి నుండి 5వ తరగతి వరకు) ఉన్నత స్థాయిలో (6వ తరగతి నుండి 10వ తరగతి వరకు) పరీక్షల సజావుగా నిర్వహణ కోసం నిర్ణయించిన సమయపట్టికను పాటించాలన్నారు. ఈ సమావేశంలో ౄCEB కార్యదర్శి G. చంద్రబాను,సహాయ కార్యదర్శి , మెరుగు రామరాజు, 32 మంది విషయ నిపుణులు పాల్గొన్నారు.