calender_icon.png 22 January, 2026 | 3:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రంజాన్ మాసంలో ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు

22-01-2026 01:20:52 AM

గద్వాల, జనవరి 21 :రంజాన్ మాసంను ముస్లింలు భక్తిశ్రద్ధలతో నిర్వహించుకునేందుకు వీలుగా ప్రభుత్వం తరఫున అవసరమైన ఏర్పాట్లన్నీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్ తెలిపారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో రంజాన్ మాసంలో మసీదులు, ఈద్గాల వద్ద చేయాల్సిన ఏర్పాట్లు, ఇతర అంశాలపై ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, ఎస్పీ శ్రీనివాసరావు తో కలిసి కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్ మాట్లాడుతూ మన దేశం లౌకిక వాదంతో మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని ముస్లింల పవిత్ర రంజాన్ మాసంలో వారికి అవసరమైన సహకారం అందించనున్నట్లు చెప్పారు. మసీదుల వద్ద పారిశుధ్యం, నీటి వసతి, విద్యుత్ సౌకర్యం, తదితర మౌలిక సౌకర్యాలను కల్పిస్తామన్నారు. అనంతరం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఏటా ముస్లిం సోదరులు రంజాన్ మాసంను ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహించుకునేందుకు వీలుగా సహకరిస్తున్నామన్నారు.

వారికి ఏ సమస్య ఉన్నా అధికారులు, తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి రంజాన్ మాసంలో ముస్లింలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు.ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, ఆర్డీవో అలివేలు, మైనారిటీ సంక్షేమ శాఖ ఇన్చార్జి అధికారిని నుషిత, డిఎంహెచ్వో సంధ్య కిరణ్మయి, పౌరసరఫరాల శాఖ మేనేజర్ విమల, గద్వాల మునిసిపల్ కమిషనర్ జానకి రామ్ సాగర్, పలు ముస్లిం సంఘాల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.