calender_icon.png 22 January, 2026 | 2:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి

22-01-2026 01:21:13 AM

మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

టీఎన్జీవో డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ

నల్లగొండ, జనవరి 21 (విజయక్రాంతి): ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలన్నింటినీ సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చే స్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అ న్నారు. హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్‌లో బుధవారం నల్లగొండ జిల్లా టీఎన్జీవో యూనియన్ నూతన డైరీ, క్యాలెండర్‌ను మంత్రి కోమటిరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యలు ఈహెచ్‌ఎస్, పెండింగ్ బిల్లులు, డీఏ విడుదల పరిష్కారం కోసం సీ ఎంతో మాట్లాడి పరిష్కరిస్తానని తెలిపారు.

టీఎన్జీవో యూనియన్ బిల్డింగ్ పూర్తి చే స్తానని హామీ ఇచ్చారు. టీఎన్జీవో జిల్లా అధ్య క్షులు నాగిళ్ల మురళి, కార్యద ర్శి జే.శేఖర్‌రెడ్డి, ఎన్‌డీసీఎంఎస్ మాజీ చైర్మ న్ బోళ్ల వెంకటరెడ్డి, టీఎన్జీవో సెంట్రల్ యూనియన్ ఉపా ధ్యక్షుడు సిహెచ్. నర్సింహచారి, విజయ్, టీ ఎన్జీవో మాజీ అధ్యక్షుడు ఏడుదొడ్ల  వెంకట్రామిరెడ్డి, కోశాధికారి జయరాజు, అసోసి యేట్ అధ్యక్షులు డిఐ రాజు, దశరథ, ప్రదీ ప్, లక్ష్మయ్య, లింగయ్య నారాయణస్వామి రాణదేవ్, ౪ తరగతి ఉద్యోగుల అధ్యక్షు లు భిక్షం, మణి, కృష్ణ, రాజమల్లు పాల్గొన్నారు.