12-08-2025 01:06:33 AM
ఎమ్మెల్యే కుంభం నిల్‌కుమార్‌రెడ్డి
యాదాద్రి భువనగిరి ఆగస్టు 11 ( విజయ క్రాంతి ) : భారత ఎన్నికల కమిషన్ బిజెపి చేతిలో కీలుబొమ్మగా మారిందని ప్రజాస్వామ్య బద్ధంగా ఆందోళన చేపట్టిన తమ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ లను అరెస్టు చేయడం అప్రజ స్వామికి మని, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రధానమంత్రి మోడీ సర్కార్ ఎన్నికల కమిషన్ ను తన సొంత జేబు సంస్థగా వాడుకుంటూ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుందని ఆరోపించారు.
బీహార్ రాష్ట్రంలో లక్షలాది ఓట్లు తారుమారు చేసిన విషయాన్ని రాహుల్ గాంధీ ఆధారాలతో బయటపెట్టిన విషయాన్ని జీర్ణించుకోలేక మోడీ తమ నాయకులను, పార్లమెంటు సభ్యులను అరెస్టు చేయించారని ఆరోపించారు. దేశ ప్రజలు బిజెపి ఎన్నికల కమిషన్ కుమ్మక్కై చేసిన ప్రజాస్వామ్య కూనిని గమనిస్తున్నారని సరైన సమయంలో బుద్ధి చెప్తారని హెచ్చరించారు.