06-12-2024 01:28:22 AM
బీఆర్‌ఎస్ నేత కేటీఆర్
హైదరాబాద్, డిసెంబర్ 5 (విజయక్రాంతి): ఏడాది పాలనలో ప్రభుత్వం చేసిన తప్పులను ప్రశ్నిస్తే అరెస్టులు చేయడం పరిష్కారం కాదని బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ విమర్శించారు. ఎక్స్‌వేదికగా ఆయన గురువారం స్పందిస్తూ.. ప్రభుత్వం ఆరు గ్యారెం టీలు అమలు చేయకుండా డైవర్షన్ రాజకీయాలు చేస్తూ తప్పించుకునేందుకు ఎత్తులు వేస్తున్నదన్నారు. ప్రభుత్వాన్ని నిలదీస్తున్న బీఆర్‌ఎస్ నాయకులను ఎక్కడికక్కడ అరెస్టులు చేసి పోలీస్‌స్టేషన్లలో నిర్బంధిస్తున్నా రని మండిపడ్డారు. అరెస్టులు సమస్యకు పరిష్కారం కాదని, హామీలు అమలు చేస్తే బాగుంటుందన్నారు. అరెస్ట్ చేసిన హరీశ్‌రావు, కౌశిక్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డితో పాటు ఇతర బీఆర్‌ఎస్ నాయకులను పోలీసులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.