calender_icon.png 11 May, 2025 | 1:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పట్టణంలో సైబర్ క్రైమ్

10-05-2025 06:49:54 PM

అపరిచిత కాల్స్ ద్వారా రూ.96,482 నష్టపోయిన వ్యాపారి

మందమర్రి,(విజయక్రాంతి): అపరిచిత వ్యక్తుల ఫోన్ కాల్స్ తో పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారి రూ.96,482 మోసపోయిన ఘటన శనివారం పట్టణంలో సంచలనం సృష్టించింది. పట్టణ ఎస్ఐ రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 7న గుర్తు తెలియని వ్యక్తులు పట్టణానికి చెందిన ట్రేడర్స్  యజమానికి ఫోన్ చేసి  25 రేకులు కావాలని ఈనెల 8న పంపాలని కోరారు. మళ్ళీ 8వ తేదీన ఫోన్ చేసి రేకులకు సంబంధించి డబ్బులు పంపుతామని వాట్సాప్ ద్వార ట్రెడర్ యజమానికి స్కానర్ పంపి రూ.1 పంపమని కోరగా పంపిన తర్వాత యజమానికి రూ.2 వచ్చాయి.

ఇలాగే మీకు రేకుల డబ్బులు మొత్తము వస్తాయని, ఇది ఆర్మీ మిషన్ అని ఆర్మీ వాళ్ళ ద్వారా డబ్బులు వస్తాయని నమ్మబలికారు. అనంతరం మరో రెండు, మూడు లింకులు పంపి వాటిని ఓపెన్ చేయమని కోరగా, ట్రేడర్స్ యజమాని ఓపెన్ చేయగా ఎలాంటి డబ్బులు రాకపోగా, తన బ్యాంక్ ఖాతా నుండి డబ్బులు విత్ డ్రా అయినట్లు మెసేజ్లు రావడంతో తాను సైబర్ క్రైమ్ మోసానికి గురైనట్టు  గ్రహించిన బాదితుడు వెంటనే 1930 సైబర్ క్రైమ్ నెంబర్ కు ఫోన్  చేసి ఫిర్యాదు చేశాడు. దీంతో ప్రాథమిక దర్యాప్తు అనంతరం ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై పట్టణ ప్రజలకు పలు సూచనలు చేశారు.

ఫోన్ ద్వారా వచ్చే సమాచారానికి స్పందించే ముందు సమాచారాన్ని దృవీకరించుకోవాలని, అనుమానాస్పద లింకులను క్లిక్ చేయరాదని కోరారు. నగదు లావాదేవీలను బ్యాంకుల ద్వారా నిర్దా రించుకోవాలని సూచించారు. అనుమానాస్పద కాల్స్, నెంబర్లపై సైబర్ క్రైమ్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయాలన్నారు. అధిక రాబడి పథకాల  పట్ల జాగ్రత్తగా ఉండాలని, కేవైసీని వ్యక్తిగతంగా అప్డేట్ చేయాలని వ్యక్తిగత వివరాలను ఎవరితో పంచుకోవద్దని సూచించారు. ఎవరైనా సైబర్ క్రైమ్ బారిన పడితే 1930 టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చుని లేదా సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ cybercrime.gov.in ద్వారా ఫిర్యాదు చేయవచ్చని కోరారు.