calender_icon.png 2 January, 2026 | 2:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆరుట్ల కమలాదేవి 24వ వర్ధంతి

02-01-2026 01:09:15 AM

ఆలేరు, జనవరి 1  (విజయక్రాంతి): మండలంలోని కొలనుపాక గ్రామంలో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు అగ్నిపుష్పం ఆరుట్ల కమలాదేవి 24వ వర్ధంతినీ సిపిఐ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారత కమ్యూనిస్టు పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి యానాల  దామోదర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో దున్నేవానికి భూమి కావాలని కొట్లాడిన వీర వనిత అరుట్ల కమలాదేవిని అన్నారు.

ఆరుట్ల కమలాదేవి రామచంద్రారెడ్డి గార్ల కాశ్య విగ్రహాలను ట్యాంకుబండ్ పై ఏర్పాటు చేయాలని వారి జీవిత చరిత్రను పాఠ్యాంశా పుస్తకాల్లో చేర్పించాలని అధికారికంగా ప్రభుత్వమే వారి జయంతులను వర్ధంతిలను చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇల్లు లేని నిరుపేదలకు ఇండ్ల ప్లాట్లు ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని ఆయన అన్నారు. ముందుగా కమలాదేవి స్తూపాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.  ఈ కార్యక్రమంలో రవి, ప్రవీణ్, యాకమ్మ, విజయేందర్ రెడ్డి, సత్యనారాయణ, వెంకటేష్, కనకయ్య, పరుశరాములు, కృష్ణ పాల్గొన్నారు.