02-01-2026 01:08:01 AM
వెల్గటూర్,జనవరి1 (విజయక్రాంతి): వెల్గటూర్ మండల కేంద్రంలోని శ్రీ చైతన్య మోడల్ పాఠశాలలో నూతన సంవత్సర ది నోత్సవ వేడుకలను ప్రధానోపాధ్యాయులు బిడారి సతీష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపా ధ్యాయులు మాట్లాడుతూ 2025 సంవత్సరానికి ముగింపు పలుకుతూ 2026 సంవ త్సరానికి స్వాగతం పలికారు. విద్యార్థులు గత సంవత్సరంలో చేసిన తప్పులను మళ్ళీ చేయకుండా విద్యను కష్టంగా కాకుండా ఇష్టంగా చదవాలని కొనియాడారు. ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని దానికి సాధన చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.