calender_icon.png 22 November, 2025 | 3:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రేక్షకుడిగా నేను ఇష్టపడే కథల్నే చెప్పాలనుకుంటా

21-11-2025 12:00:00 AM

ప్రియదర్శి హీరోగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ చిత్రం ‘ప్రేమం టే’. ఆనంది హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో సుమ కనకాల ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. నవనీత్ శ్రీరామ్ డైరెక్టర్‌గా అరంగేట్రం చేస్తున్నారు. పుస్కూర్ రామ్‌మోహన్‌రావు, జాన్వీ నారంగ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హీరో ప్రియదర్శి విలేకరుల సమావేశంలో ఈ చిత్ర విశేషాలు పంచు కున్నారు.

“--మనం ఇష్టపడి పెళ్లి చేసుకున్న తర్వాత మొదలయ్యే జీవితంలో చాలా డైనమిక్స్ మారుతాయి. ప్రేమంటే ఇంత బాగుంటుందని అనుకోవడం దగ్గరనుంచి ఇలా కూడా ఉంటుందని ఈ సినిమాలో చూపించాం. సినిమా అందరూ రిలేట్ చేసుకునేలా ఉంటుంది. ఒక ప్రేక్షకుడిగా నేను చూడాలనుకున్న సినిమాలు, మంచి కథలను చెప్పే ప్రయత్నం చేస్తుంటా.

నేను కాస్త విలక్షణమైన కథలు చేస్తానని ప్రేక్షకులు గుర్తించారు. ఆ బాధ్యతతో ప్రేక్షకుల దగ్గర మరింత ప్రేమ, గౌరవం పొందడానికే సినిమాలు చేస్తున్నా” అన్నారు. తన కొత్త సినిమాల గురించి చెప్తూ -పొలిటికల్ థ్రిల్లర్‌గా ‘అసమర్ధుడు’ సినిమా చేస్తున్నానని, థ్రిల్లర్ జానర్‌లో ‘సుయోధన’ చిత్రం వస్తోందన్నారు.