calender_icon.png 22 November, 2025 | 3:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అవరోధాలను అధిగమించడం ద్వారానే ఉన్నత లక్ష్యాలు సాధ్యం

21-11-2025 12:00:00 AM

ప్రముఖ సినీ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఆధ్యా హనుమంతు 

భూత్పూర్, నవంబర్ 20 : లక్ష్యాలను ఎంచుకొని.. ముందుకు సాగే క్రమంలో ఎన్నెన్నో ఆటంకాలు ఎదురవుతాయి.. వాటిని ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగడం ద్వారానే  వాటిని సాధించగలుగుతాము అని ప్రముఖ సినీ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఆధ్యా హనుమంతు చెప్పారు. గురువారం భూత్పూర్ మండల కేంద్రంలోని స్వామి వివేకానంద విద్యాలయం లో విద్యార్థుల తో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆధ్యా హనుమంతు మాట్లాడుతూ  చిన్నప్పటినుండి తనకు ఆడపిల్లల వాయిస్ ఉండడం   వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న.. నా వాయిస్ విని మా బంధువుల ద్వారా  మొదట టీవీ సీరియల్‌లో ఓనటికి డబ్బింగ్ చెప్పాను. ఆ తర్వాత విద్యాభ్యాసం చేస్తూనే డబ్బింగ్ రంగంలో ప్రాణించాను. అవమానాలను అనుకూలంగా మార్చుకొని ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ వచ్చాను. ప్రముఖ సినీ హీరోయిన్లు సాయి పల్లవి, సమంత తదితరులకు డబ్బింగ్ చెప్పాను అని ఆయన వెల్లడించారు.

ఎనిమిది భాషలలో  అలవోకగా మాట్లాడగలను.. రాయగలను.. చదవగలను.. రచనలు చేయగలను.. డబ్బింగ్ చెప్పగలరు అని ఆత్య వివరించారు. ప్రతి విద్యార్థులో ప్రతిభ దాగి ఉన్న కళ, విద్యను వెలుగులోకి తెచ్చుకొని నిరంతర సాధన వల్ల గొప్ప స్థాయికి చేరుకోవచ్చన్నారు. ఈ సందర్భంగా  ఆయన ఫిదా, తదితర సినిమాల్లో హీరోయిన్లకు చెప్పిన డైలాగులను చెప్పి అందరిని ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.