21-11-2025 12:00:00 AM
నాగచైతన్య హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ప్రస్తుతం ‘ఎన్‌సీ24’ అనే మేకింగ్ టైటిల్‌తో ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. మిథికల్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తు న్నారు. శ్రీవేంకటేశ్వర సినీచిత్ర ఎల్‌ఎల్‌పీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బీవీఎస్‌ఎన్ ప్రసాద్, సుకుమార్ నిర్మిస్తున్నారు. మీనా క్షి చౌదరి కథానాయికగా నటిస్తున్న.
ఈ చిత్రం లో ‘లాపతా లేడీస్’ ఫేమ్ స్పార్ష్ శ్రీవాస్తవ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ యాక్షన్ షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇందులో ప్రధాన నటీనటులు పాల్గొంటున్నారు. ఇదిలావుండగా, మేకర్స్ తాజాగా విడుదల చేసిన మేకింగ్ వీడియో సినీప్రియుల దృష్టి ఒక్కసారిగా ఈ చిత్రం వైపు మళ్లేలా చేసింది. ఈ వీడియోలో ప్రొడక్షన్ డిజైనర్ శ్రీనాగేంద్రకుమార్ తంగాల, తన వందలాది మంది టీమ్‌తో కలిసి కొన్ని ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన సెట్‌కు సంబంధించిన విజువల్స్ సినిమా భారీతనాన్ని ప్రతిబింబింపజేస్తున్నాయి.
ఇంటర్నేషనల్ యాక్షన్ కొరియోగ్రాఫర్ జుజి మాస్టర్ పర్యవేక్షణలో నాగచైతన్య తీసుకున్న శిక్షణ, పాత్ర కోసం ట్రాన్స్‌ఫర్మేషన్ అయిన తీరుతెన్నులను ఇందులో అద్భుతంగా చూపించారు. దీనికి అజనీష్ లోకనాథ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ వీడియోలో చివరగా నాగచైతన్య పుట్టిన రోజు సందర్భంగా నవంబర్ 23న ఈ మూవీ టైటిల్, ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేస్తున్నట్టు టీమ్ అధికారికంగా ప్రకటించటం ఆసక్తిని రేకెత్తించింది. ఈ చిత్రానికి సమర్పణ: బాపినీడు; సంగీతం: అజనీష్ బీ లోక్‌నాథ్; సినిమాటోగ్రఫీ: రాగుల్ డీ హెరియన్; ఎడిటర్: నవీన్ నూలి; నిర్మాతలు: బీవీఎస్‌ఎన్ ప్రసాద్, సుకుమార్; దర్శకత్వం: కార్తీక్ దండు.