01-07-2025 10:27:23 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్(District Minority Residential School) విద్యార్థి కే.అశ్వ సాయి తేజ ఇటీవల ఖమ్మంలో నిర్వహించిన అథ్లెటిక్స్ పోటీల్లో ప్రతిభ చాటి ద్వితీయ స్థానంలో నిలిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాడని ప్రిన్సిపల్ డాక్టర్ జి. శ్రీనివాసరావు, పీఈటి ఎండి నసీరుద్దీన్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ నిర్వహించిన పోటీల్లో పతకం సాధించి పాఠశాల పేరు నిలబెట్టిన అశ్వ సాయి తేజను అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీల్లో విజయం సాధించి మహబూబాబాద్ జిల్లాకు పేరు ప్రఖ్యాతులు తెచ్చి పెట్టాలని ఆకాంక్షించారు.