01-07-2025 10:32:55 PM
హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్..
హనుమకొండ (విజయక్రాంతి): బి ఎస్ రాయ్ వైద్యరంగంలో చేసిన సేవలకు గుర్తుగా జులై 1న భారతదేశంలో డాక్టర్స్‌డే(National Doctors Day) నిర్వహించుకోవడం జరుగుతుందని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్(District Collector Sneha Shabarish) అని అన్నారు. కలెక్టరేట్ లో డాక్టర్స్ డే పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి కలెక్టర్ ప్రారంభించారు. ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ... జాతీయ వైద్యుల దినోత్సవ సందర్భంగా వైద్య అధికారులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి పేదవాడికి వైద్యం అందాలని, ఆరోగ్య తెలంగాణ దిశగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని, తాను కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం అయ్యానని తెలియజేశారు. ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలు వినియోగించుకోవాలని, ప్రతి వైద్యుడు అంకితభావంతో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు.
జాతీయ వైద్యుల దినోత్సవ సందర్భంగా జిల్లాలో పనిచేస్తున్నటువంటి వైద్యులకు జిల్లా కలెక్టర్ శాలువాతో సన్మానించి, ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, కేఎంసి కళాశాల ప్రిన్సిపల్ కె రామ్ కుమార్ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఏ. అప్పయ్య, అడిషనల్ వైద్య అధికారి డాక్టర్ టి. మదన్ మోహన్ రావు, జిల్లా ఇమినేషన్ అధికారి డాక్టర్ మహేందర్, జిల్లా క్షయ వ్యాధి నివారణాధికారి డాక్టర్ హిమబిందు, ప్రోగ్రాం అధికారి ఎంసిఎచ్ డాక్టర్ మంజుల, ప్రోగ్రాం ఆఫీసర్ ఇన్ సిడి డాక్టర్ అహ్మద్, అడ్మిస్ట్రేటివ్ అధికారి కోల రాజేష్, జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, బస్తీ, పల్లె దవాఖాన వైద్యాధికారులు, ఆర్ బిఎస్కే వైద్యాధికారులు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.