calender_icon.png 2 July, 2025 | 3:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గంజాయి తరలిస్తున్న నలుగురి అరెస్టు

01-07-2025 10:25:25 PM

మేడ్చల్ అర్బన్: తెలంగాణ రాష్ట్రంలో గంజాయి, మదకద్రవ్యాలపై ప్రభుత్వం, సంబంధిత అధికార యంత్రాంగం ఉక్కు పాదం మోపుతుంది. అయినప్పటికీ క్షేత్రస్థాయిలో గంజాయి, మాదకద్రవ్యాల సరఫరా చాపక్రింద నీరులా దూసుకుపోతుంది. మంగళవారం అబ్కారీ పోలీసులు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధి మేడ్చల్ చెక్‌పోస్టులో రూటు వాచ్ చేపట్టారు. అందులో భాగంగా తనిఖీలు చేపట్టారు. తమ తనిఖీలలో నలుగురు అనుమానాస్పద యువకుల నుండి 255 గ్రాముల హాష్ ఆయిల్, 475 గ్రాముల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు మేడ్చల్ అబ్కారీ సిఐ నవనీత(CI Navneetha) పత్రిక ప్రకటనలో పేర్కొన్నారు. గంజాయి తరలిస్తున్న వ్యక్తులు మహేష్ బాబు, నరేందర్, ఫిలిప్స్, జార్జిలుగా గుర్తించమని నవనీత చెప్పారు. గంజాయిని తరలిస్తున్న నిందితుల నుండి రెండు ద్విచక్ర వాహనాలతో పాటు నాలుగు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్కు తరలించినట్లు అబ్కారీ సిఐ నవనీత వెల్లడించారు.