31-01-2026 12:01:35 AM
వాసవి క్లబ్ డిస్టిక్ గవర్నర్ చారుగుళ్ల
మణుగూరు, జనవరి 30,(విజయక్రాంతి): రెండు సంవత్సరాలకొకసారి వైభవంగా జరిగే మినీ మేడారం జాతర వద్ద వాసవీక్లబ్, ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో వేలాది మందికి అన్నదాన వితరణ ప్రశం సనీయమని వాసవీక్లబ్ వి.106ఏ గవర్న ర్ చారుగుళ్ల శ్రీనివాస్ అన్నారు. మణుగూరు వాసవీక్లబ్ ఆధ్వర్యంలో మినీ మేడారం వద్ద భక్తుల సౌకర్యార్థం, మేడారం వెళ్లే భక్తుల కోసం మూడు రోజుల పాటు ఏర్పాటు చేసిన అన్నదానం కార్యక్రమాన్ని కేబినెట్ సభ్యులు రేపాక రాజమనోహర్, ఉడతా నగేశకుమార్, సీమకుర్తి రాజమనోహర్, లీలాకృష్ణలతో కలిసి ఆయన ప్రారంభించి మాట్లాడారు.
28,29, 30 తేదీలలో వనదేవతలను సందర్శించేందుకు వేలాది మంది భక్తులు వస్తుంటారని అలాంటి వారికి మూడు రోజుల పాటు ఉచిత అన్నదానం వాసవి క్లబ్ ఆధ్వర్యంలో సదుపాయం కల్పించడం గర్వించదగిన విషయం అన్నారు. వేలాది మంది భక్తులు అన్నదానం సద్వినియోగం చేసుకొని మేడారం పయనం అవ్వడం అభినందనీయమన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలను భవిష్యత్తులో మరిన్ని చేపట్టాలని ఆకాంక్షించారు. వాసవి క్లబ్, నియోజకవర్గ ఆర్యవైశ్య సంఘాలు, దోసపాటి రంగారావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భారీ అన్నదానం ఏర్పాటు చేసి భక్తులకు అన్నిరకాల సేవల అందించిన సభ్యులను ప్రశంసించారు.
అనంతరం మండల వాసవీక్లబ్ అధ్యక్షుడు శ్యామ్ ఆధ్వర్యంలో గవర్నర్ చారుగుళ్ల శ్రీనివాస్ ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మణుగూరు వాసవీక్లబ్ ఉపాధ్యక్షుడు గౌరీ శంకర్, కార్యదర్శి కిశోర్, సూర్యం, జిల్లా ఆర్యవైశ్య సంఘం మహిళా అధ్యక్షురాలు చిత్తలూరి ఉమ, నియోజకవర్గ అధ్యక్షుడు కత్తిరాము, వర్తక సంఘం అధ్యక్షుడు, శివ కామేశ్వరి గ్రూప్ డైరెక్టర్స్ దోసపాటి నాగేశ్వరరావు, పిచ్చేశ్వరరావు, రాము, వాసవీక్లబ్ ముఖ్య ప్రతినిధులు బండారు నర్సింహారావు, కడవెండి విశ్వనాధ గుప్తా, దింటకుర్తి బ్రహ్మయ్య, ఆర్య వైశ్య అశ్వాపురం సంఘ ప్రతినిధులు కోటగిరి సందీప్ పాల్గొన్నారు.