calender_icon.png 26 January, 2026 | 10:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అతివలు..అదుర్స్

31-12-2024 12:00:00 AM

2024 మహిళా మణులు

కాలం.. ఎన్నో సవాళ్లు సమస్యలను విసురుతుంటుంది. వాటిని తట్టుకుని నిలబడినవారే సక్సెస్ అవుతారు. పరిస్థితులు వెనక్కి లాగినా.. అవకాశాలు చేజారినా తగ్గేదేలే అంటూ సత్తా చాటిన మహిళలు ఎందరో‘చరిత్ర చదవడమే కాదు సృష్టించాలి కూడా’అనే మాటలను నిజం చేసి నిరూపించారు. అత్యంత శక్తిమంతమైన, స్ఫూర్తిమంతమైన మహిళలుగా చరిత్రలో తమకంటూ ఓ పేజీని లిఖించారు. 2024లో ఆయా రంగాల్లో రాణించిన మహిళల గురించి..

నేషనల్ క్రష్ అరుదైన ఘనత

తెలుగుతో పాటు, హిందీలోనూ వరుస చిత్రాలతో దూసుకుపోతున్న కథానాయిక రష్మిక ఈ సంవత్సరం అరుదైన ఘనతను అందుకుంది. ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకటించిన ‘ఫోరబ్స్ ఇండియా 30 అండర్ 30’ జాబితాలో స్థానం సంపాదించుకుంది. ఏటా వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచే వ్యక్తుల జాబితాను ఫోరబ్స్ విడుదల చేస్తుంది. 30 ఏళ్ల వయసులోపున్న 30 మంది ప్రతిభావంతుల జాబితాను తాజాగా విడుదల చేసింది.

ఈ జాబితాలో రష్మిక అగ్రస్థానంలో నిలిచింది. నేషనల్ క్రష్ రష్మిక క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ లోనూ దూసుకుపోతోంది ఈ బ్యూటీ. 27 ఏళ్ల  నటి తన ప్రతిభతో ప్రేక్షకులను ఆకర్షిస్తూ  భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తిరుగులేని హీరోయిన్ గా వెలుగొందుతుంది.

దటీజ్ సింధు

పీవీసింధు... బ్యాడ్మింటన్‌లో రెండు ఒలింపిక్ పతకాలను సాధించి, ఆ ఘనత సాధించిన తొలి భారత మహిళగా చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ వేదికలపై ఎన్నో పతకాలు సాధించింది. 2016 రియో ఒలింపిక్స్ రజత పతకం తన ఖాతాలో వేసుకోగా.. రియోలో ఆమె సాధించిన బంగారు పతకాల్లో ప్రపంచ నంబర్ వన్ కరోలినా మారిన్ ఓడించి సత్తా చాటింది.

టోక్యో ఒలింపిక్స్లో సింధు కాంస్య పతకం సాధించింది. ఇది కాకుండా ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో ఒక స్వర్ణం, రెండు రజతం, ఒక కాంస్య పతకం ఉంది. కామన్వెల్త్ క్రీడల్లో రెండు స్వర్ణం, రజతం, ఓ కాంస్యం సాధించింది. ఆసియా స్థాయిలోనూ వివిధ పతకాలు తన ఖాతాలో వేసుకుంది. ఇటీవలనే పెళ్లి చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. 

మహిళా చైతన్యం కోసం

‘మహిళలు వంటింటి కుందేళ్లు’ అనుకునే రోజుల్లోనే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ పరీక్ష రాసి ఎంపికైంది అరుణా రాయ్. ఆమె కిందిస్థాయి నుంచి  ’లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ దిల్లీ’ సెక్రెటరీ వరకు ఎన్నో పదవులు చేపట్టారు.  ప్రతి రంగంలోనూ అవినీతి ఉండటంతో జీర్ణించుకోలేకపోయింది. ఈ అసంతృప్తులు తారస్థాయికి చేరడంతో ఉద్యోగానికి రాజీనామా చేసింది.

ఆ తర్వాత భర్తతో కలిసి భర్త సంజిత్ రాయ్ నిర్వహిస్తున్న సోషల్ వర్క్ రిసెర్చ్ సెంటర్(బేర్ఫుట్ కాలే జీ)లో చేరింది. మనదేశంలో అనేక గ్రామాల్లో విద్యుత్ సరఫరా, తాగునీటి సౌకర్యం, రోడ్డు సౌకర్యం లేవు.

కిలోమీ టర్ల కొద్దీ దూరం నడవాల్సి వచ్చేది. ఇవన్నీ అరుణా రాయ్ కలిచివేశాయి. మహిళలు ఒక బృందంగా ఏర్పడి గ్రామ అభివృద్ధికి పాటుపడేలా కృషి చేసింది. అంతేకాదు.. దేశంలో సమాచార హక్కు చట్టం అమల్లోకి రావడంలో అరుణా రాయ్ పాత్ర కీల కం. సమాచార హక్కును సద్వినియోగం చేసుకోవడం ద్వారా స్త్రీలు సమానత్వం, సాధికారత సాధించగలుగుతారనే లక్ష్యంతో ఎంతోమందిని చైతన్య పర్చింది.

ఆర్థికంలో ముందడుగు

ఫోర్బ్స్ 2024 ప్రపంచ 100 అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో ముగ్గురు భారతీయు ల మహిళల్లో ఒకరిగా నిర్మలా సీతారామన్ నిలిచారు. ఈ జాబితాలో ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్ 28వ స్థానంలో ఉన్నారు. మనదేశ 4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సమర్థవంతంగా నడిపిస్తోంది. అంతేకాదు.. మహిళల ఆర్థిక సాధికారత కోసం అనేక కార్యక్రమాలు చేస్తూ తన ప్రభావం చూపుతోంది. 

సాధారణ సేల్స్ మేనేజర్ నుంచి అంచెలంచెలుగా ఎదిగి, తాజాగా అత్యంత కీలకమైన దేశ రక్షణ మంత్రిస్థాయికి ఇందిరాగాంధీ తరువాత ఎదిగిన రెండో వ్యక్తి నిర్మలా సీతారామన్, అందునా.. పూర్తిస్థాయిలో దేశ రక్షణ మంత్రిత్వశాఖను చేపట్టిన తొలి మహిళ సీతారామన్ కావడం విశేషం. 2019 నుండి ఆర్థిక మంత్రిగా భాద్యతలు నిర్వహిస్తోంది. వరుసగా ఏడోసారి కేంద్ర వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తొలి ఆర్థిక మంత్రి, మహిళా మంత్రిగా కూడా గుర్తింపు పొందింది.

ట్రాన్స్ జెండర్లకు స్నేహ హస్తం

ట్రాన్స్ జెండర్ అంటేనే సమాజంలో చిన్నచూపు... ఎన్నో ఛీత్కారాలు.. మరెన్నో అవమానాలు.. సొసైటీలో నిత్యం కళ్లముందు జరిగే అవమానాలు.. ఇవన్నీ ఆమెను కదిలించాయి. ’ట్రాన్స్ అంటే జస్ట్ జెండర్ మాత్రమే.. ఒక ఇన్స్పిరేషన్’ అంటూ చాటిచెబుతుందామె. అంతేకాదు.. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ట్రాన్స్ జెండర్ జీవితాల్లో వెలుగులు నింపుతోంది.

ఇతర జెండర్స్కు పోటీగా నిలుస్తూ ‘బెస్ట్ ఇన్‌ప్లూయెనర్స్’గా పేరు తెచ్చుకుంది. సతీష్ కుమార్ వరంగల్ జిల్లా. మొత్తం ముగ్గురు సంతానం అందులో పెద్దవారు సతీష్ అయితే చిన్నప్పట్నుంచే హార్మోన్ సమస్యతో బాధపడేవాడు. ఆ విషయం అతనికి కూడా తెలియదు, కానీ ప్రవర్తన అచ్చం ఆడపిల్లలా ఉండేది.  తీరు మార్చుకోవాలని మందలించినా వినలేదు.

ఆ తర్వాత ట్రాన్స్‌జెండర్‌గా మారింది. ఇక తనలాంటివారి కోసం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది. తెలం గాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఇలా పలు రాష్ట్రాలకు చెందిన ట్రాన్స్ కళాకారులను ఆ యూట్యూబ్ ద్వారా పరిచయం చేస్తోంది. ట్రాన్స్ జెండర్ల జీవితాలను యూట్యూబ్ ఛానల్ ద్వారా కళ్లకు కట్టినట్లు వివరిస్తుంది. 

తొలి మహిళా రెజ్లర్‌గా

మనదేశ ప్రతిభవంతులైన రెజ్లర్లలో వినేష్ ఫోగట్ ఒకరు. చాంపియన్‌షిప్, కామన్వెల్త్, ఆసియా క్రీడల్లో అనేక పతకాలు గెలుచుకొని భారతదేశ పతాకాన్ని రెపరెపలాడేలా చేసింది. 2024లో ఫోగట్ ఒలింపిక్ ఫైనల్కు చేరుకున్న తొలి భారతీయ మహిళా రెజ్లర్‌గా నిలిచింది. అయితే, ఫైనల్లో పాల్గొనేందుకు అర్హత ఉన్న బరువు ప్రమాణాలను అందుకోవడంలో విఫలమవడంతో ఆమె తర్వాత అనర్హత వేటు పడింది.

అయినా ఆధైర్యపడలేదు. పడిలేచిన కెరటం రాజకీయాల్లోనూ రాణి స్తోంది. ఆగస్ట్ 25, 1994న హర్యానాలోని చర్కి దాద్రీలో జన్మించిన వినేష్ ఫోగట్ కుస్తీ పట్టే కుటుంబం. గాయాలతో సహా అనేక సవాళ్లను ఎదుర్కొన్నప్ప టికీ, ఆమె పట్టుదలతో పోరాడి తనంతట తానుగా జాతీయ, అంతర్జాతీయ వేదికలపై చాంపియన్‌గా నిలిచారు. బీబీసీ విడుదల చేసిన స్ఫూర్తివంతమైన మహిళల్లో ఒకరిగా గుర్తింపు పొందింది. 

అనాథ శవాలకు అంత్యక్రియలు

మన కళ్ల ముందు ఎంతోమంది పేదలు చనిపోతుంటారు. కానీ అంత్యక్రియలు పూర్తి చేయడానికి ఎవరు ముందుకురాని సంద ర్భాలెన్నో. ఇవన్నీ పూజా శర్మను కదిలించాయి. ఈమె ఎన్నో అనాథ శవాలకు అంత్యక్రియలు చేసి పేదలకు అండగా నిలు స్తోంది. 1996 జూలై 7న ఢిల్లీలోని ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టారు. 2022లో వారి కుటుంబంలో అనుకోని ఘటన జరిగింది.

అనారోగ్యం బారిన పడి తన తల్లి ప్రాణాలు కోల్పోయారు. అయితే ఆ తర్వాత తన సోదరుడి అంత్యక్రియలు చేయడానికి ఎంతమందిని అడిగినా ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఆమే స్వయంగా తన సోదరుడికి అంత్యక్రియలు నిర్వహించారు. ఇందుకుగానూ బంధువులు, కులస్థుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నారు.

అయినా కూడా బెదరకుండా తన అన్నయ్యలా అకార ణంగా ప్రాణాలు పోగొట్టుకున్న వారికి, అనాథ శవాలకు వారి కుటుంబంలోని ఓ వ్యక్తిగా అంత్యక్రియలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. గత మూడేళ్లుగా ఢిల్లీలో వదిలేసిన మృతదేహాలకు పూజా శర్మ అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు ఆమె 4,000 మందికి పైగా అంత్యక్రియలు నిర్వహిం చింది.

అత్యంత సంపన్న మహిళల్లో

ఫోర్బ్స్ పవర్ ఉమెన్ లిస్టులో 82వ స్థానంలో నిలిచారు. 2024లో భారతదేశంలోని అత్యంత సంపన్నుల జాబితాలో 91వ స్థానంలో ఉన్నారు.1978లో కిరణ్ మజూందర్ బయోకాన్‌ను నెలకొల్పారు. ఆ తర్వాత కాలంలో ఆమె భారత్‌లో అత్యంత సంపన్న మహిళల్లో ఒకరుగా ఎదిగారు. బయోకాన్ మలేషియాలోని జొహొర్లో ఆసియాలోనే అతిపెద్ద ఇన్సులిన్ పరిశ్రమ ఉంది.

గోవిందమ్మా.. యూఆర్ గ్రేటమ్మా

వనపర్తి జిల్లా పెబ్బేరు టౌ న్.. ఎప్పుడైనా అ టు వెళ్తే.. మన కళ్లముందు ఓమ్నీ మినీ వ్యాన్ రయ్ మంటూ గల్లీల్లో దూసుకుపోతుంటోంది. ఇంతకీ ఆ ఓమ్నీ స్పెషల్ ఏమి టంటారా.. ఆ డ్రైవర్ ఓ లేడీ. ఆమె వయసు 48. ఆ వయసులో డ్రైవర్‌గా ఎందుకు మారిందనుకుంటున్నారా.. చిన్న వయ సులోనే భర్త దూరమైనా.. కుటుంబానికి అన్నీతానై అండగా నిలబడింది. ఆమెను ఒకసారి కలిస్తే.. ‘గోవిందమ్మా.. యూఆర్ గ్రేటమ్మా..’ అని మీరే అంటారు. 

వ్యూహాత్మక నిర్ణయాలతో

ఫోరబ్స్ జాబితాలో 81వ స్థానంలో ఉన్న రోష్ని నాడార్ మల్హోత్రా. భారతదేశంలోని ప్రముఖ ఐటీ సేవల సంస్థల్లో ఒకటైన హెచ్సీఎల్ టెక్నాలజీస్ చైర్పర్సన్ గా వ్యవహరిస్తున్నారు. హెచ్‌సీఎల్ వ్యవస్థాపకుడు శివ్నాడార్ కుమార్తె రోష్నీ నాడార్ మల్హోత్రా. జులై 2020లో హెచ్సీఎల్ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వ్యూహాత్మక నిర్ణయాలతో కంపెనీని అగ్ర పథంలో నడిపిస్తున్నారని ఫోర్బ్స్ తెలిపింది.