24-10-2025 12:21:52 AM
ఘట్ కేసర్, అక్టోబర్ 23 (విజయక్రాంతి): ప్రమాద వశాత్తు విద్యుత్ షాక్ తగిలి ట్రాక్టర్ డ్రైవర్ మృతి చెందిన సంఘటన ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం అంకుశాపూర్ కు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ నిమ్మల సాయికుమార్ (22) గురువారం సాయంత్రం గ్రామంలోని బలిజోని బావి సమీపంలో వరికోత మిషన్ తో వరి కోస్తుండగా పై భాగంలో సర్వీస్ వైన్ తగిలి షాక్ రావటంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
గమనించిన సహచరులు వెంటనే ఘట్ కేసర్ ఘట్ కేసర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడి వైద్యులు పరిక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. సాయికుమార్ మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం నగరంలోని గాంధీ ఆసుపత్రికి తరలించి మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.