calender_icon.png 22 November, 2025 | 1:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

షాద్‌నగర్‌లో స్టాఫ్‌నర్స్‌పై దాడి

17-08-2024 02:44:58 AM

  1. విధులు బహిష్కరించి నిరసన తెలిపిన వైద్య సిబ్బంది 
  2. నిందితురాలి అరెస్టు

రంగారెడ్డి, ఆగస్టు 16 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ కమ్యూనిటీ దవాఖానలో స్టాఫ్‌నర్స్‌పై దాడి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. షాద్‌నగర్ పట్టణంలోని బృందావన్ కాలనీకి చెందిన నీలం రేణుకుంట భార్గవి గురువారం కుక్కకాటు వ్యాక్సినేషన్ డోస్ వేయించుకొనేం దుకు కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు మధ్యా హ్న సమయంలో వెళ్లింది. అక్కడ విధులు నిర్వహిస్తున్న స్టాఫ్ నర్స్ దాసరి ఆషాను కలిసి తనకు కుక్క కాటుకు సంబంధించిన రెండవ డోస్ వేయాలని కోరింది.

మీకు మొదటిసారి వేసిన వ్యాక్సినేషన్ డోస్‌కు సంబంధించిన ప్రిస్క్రిప్షన్ తీసుకొని వస్తే రెండవ డోస్ వ్యాక్సినేషన్ వేస్తానని స్టాఫ్‌నర్స్ సమాధానం చెప్పింది. దీంతో అక్కడి నుంచి వెళ్లినపోయినభార్గవి అదేరోజు సాయంత్రం దావాఖానకు వచ్చి విధుల్లో ఉన్న స్టాఫ్‌నర్స్‌పై దాడికి పాల్పడింది. తోటి వైద్య సిబ్బంది అడ్డుకొని స్టాఫ్‌నర్స్‌ను కాపాడారు. కాగా దాడి దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఈ క్రమంలో వైద్య సిబ్బంది శుక్రవారం విధులను బహిష్కరించి నిరసనకు దిగారు. తమకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితురాని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.