calender_icon.png 22 November, 2025 | 1:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజాసాబ్ పాటల పల్లకి

22-11-2025 01:05:44 AM

ప్రభాస్ హీరోగా డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్న చిత్రం ‘రాజాసాబ్’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రంలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ కథానాయికలుగా నటిస్తుండగా, సంజయ్ దత్ ముఖ్యపాత్రలో కనిపించనున్నారు. హారర్ కామెడీ జానర్‌లో రూపొందు తున్న ఈ సినిమా నుంచి తాజాగా క్రేజీ అప్‌డేట్ వచ్చింది. ఈ చిత్రంలోని తొలిగీతాన్ని ఈ నెల 23న రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ శుక్రవారం ప్రకటించారు.

ఈ మేరకు విడుదల చేసిన ఫస్ట్ సాంగ్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో ప్రభాస్ స్టైలిష్‌గా, వింటేజ్ లుక్‌లో కనిపిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా 2026, జనవరి 9న విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్; సినిమాటోగ్రఫీ: కార్తీక్ పళని; ఫైట్స్: రామ్ లక్ష్మణ్, కింగ్ సోలొమన్; ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు; ప్రొడక్షన్ డిజైన్: రాజీవన్; నిర్మాత: టీజీ విశ్వప్రసాద్; రచన, దర్శకత్వం: మారుతి.