calender_icon.png 22 November, 2025 | 12:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బహుజన వీరుడు సర్వాయి పాపన్న

17-08-2024 02:42:02 AM

మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ 

ముషీరాబాద్, ఆగస్టు 16: సర్దార్ సర్వా యి పాపన్న గౌడ్ బహుజన వీరుడని, ఆయ న జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మం త్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు. తెలంగాణ గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బాలగోని బాలరాజు గౌడ్ ఆధ్వర్యంలో శుక్రవారం చిక్కడపల్లిలోని కల్లు కాంపౌండ్ వద్ద నిర్వహించిన సర్వాయి పాపన్న 374వ జయంతి కార్యక్రమంలో మంత్రి పొన్నంతో పాటు ఎంపీ ఈటల రాజేందర్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, ఎమ్మెల్సీ మహేష్‌కుమార్‌గౌడ్, మాజీ ఎంపీ వీ హనుమంతరావు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, మాజీ ఐఏఎస్ చిరంజీవులు, ఏపూరి సోమ న్న తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమం లో వారు మాట్లాడారు.