calender_icon.png 22 November, 2025 | 1:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజస్థాన్ టు హైదరాబాద్ డ్రగ్స్ సప్లు

17-08-2024 02:47:23 AM

  1. ముగ్గురు పెడ్లర్లతో పాటు ఐదుగురు కస్టమర్ల అరెస్టు 
  2. రూ. 4.65 కోట్ల విలువైన హెరాయిన్ స్వాధీనం

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 16 (విజయక్రాంతి): రాజస్థాన్ నుంచి హైదరా బాద్‌కు డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు శుక్రవారం మాదాపూర్ డీసీపీ  జీ వినీత్  వివరాలను వెల్లడించారు. రాజస్థాన్‌కు చెందిన మంగలారం చౌదరి, దినేశ్ చౌదరి, గణేశ్ చౌదరి ప్రస్తుతం హైదరాబాద్‌లో నివాసముంటున్నారు. సులువుగా డబ్బులు సంపాదించేందుకు మాదక ద్రవ్యాలను విక్రయించాలని నిర్ణయించుకున్నారు.

దీంతో తమ రాష్ట్రానికి చెందిన సవర్ జాట్‌కు రూ. 48 వేలు అడ్వాన్స్‌గా చెల్లించి డ్రగ్స్ ఆర్డర్ చేశారు. ఈ నెల 7న సవార్ హైదరాబాద్‌కు వచ్చి 620 గ్రాముల హెరాయిన్ పేస్ట్‌ను ఇచ్చి వెళ్లాడు. డ్రగ్స్‌ను కస్టమర్లకు సరఫరా చేసేందుకు రాజస్థాన్‌కు చెందిన రమేశ్ చందు, సురేశ్‌ను పిలిపించారు. వారిని ఈసీఐఎల్ ప్రాంతంలోని మైత్రి హోటల్‌లో ఉంచారు. అనంతరం కస్టమర్లకు డ్రగ్స్ సరఫరా చేసేందుకు నిందితు లు గచ్చిబౌలిలోని లైట్ స్టోర్ ప్రాంతానికి వచ్చారు.

విశ్వసనీయ సమాచారం మేరకు సైబరాబాద్ ఎస్వోటీ, మాదాపూర్ టీమ్, రాయదుర్గం పోలీసులు తనిఖీలు నిర్వహించి డ్రగ్ పెడ్లర్లు మంగలారం చౌదరి, దినేశ్ చౌదరి, గణేశ్ చౌదరితో పాటు వినియోగదారులు నితిన్ గుజార్, ప్రకాశ్ చౌదరి, జైవాట్రం వాస్నారం దేవాసి, ప్రకాశ్ చౌదరి, బనారం చౌదరిని  అరెస్టు చేశారు. నిందితులపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీసీపీ తెలిపారు. వారి నుంచి రూ.4.65 కోట్ల విలువైన 620 గ్రాముల హెరాయిన్ పేస్ట్, 2 కార్లు, 8 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.సవర్ జాట్‌తో పాటు డ్రగ్స్ సప్లు చేయడానికి వచ్చిన ఇద్దరు పరారీలో ఉన్నారని డీసీపీ వెల్లడించారు. 

బెంగళూరు నుంచి డ్రగ్స్ సరఫరా

బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ సరఫరా చేస్తున్న పీవీ రాహుల్, మహేశ్ అనే ఇద్దరు పెడ్లర్లను శుక్రవారం అరెస్టు చేసినట్లు ఎక్సైజ్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ జాయింట్ కమిషనర్ ఖురేషి తెలి పారు. వారి నుంచి రూ. 4.50 లక్షల విలువైన 29.6 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు.

నిందితులిద్దరూ బెంగళూరు లోని జెప్టో అనే ఈ కామర్స్ సంస్థ లో పనిచేస్తున్నట్లు వివరించారు. ఉద్యోగం చేస్తూనే పలు నగరాలకు మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్న ట్లు వెల్లడించారు. వీరిద్దరూ నితిన్ రెడ్డి, నైజీరియాకు చెందిన వ్యక్తి ద్వారా డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని, వారిని కూడా త్వరలో పట్టుకుంటామని తెలిపారు.