30-08-2024 01:51:50 AM
ఖమ్మం, ఆగస్టు 29 (విజయక్రాంతి): ఈఎంఐ కట్టలేదని ఫైనాన్స్ సంస్ధ ఉద్యోగి ఒకరు హెల్మెట్‌తో దాడి చేసి, ఓ వ్యక్తిని గాయపర్చిన ఘటన ఖమ్మం జిల్లా వైరా మండలం కనిగిరి సిరిపురంలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నారపోగు లక్ష్మణ్‌రావు బజాజ్ ఫైనాన్స్‌లో రూ.15 వేలు లోన్ తీసుకుని, పరుపు, బీరువా కొనుగోలు చేశాడు. అయితే ప్రతి నెలా ఈఎంఐ బాగానే చెల్లిస్తున్నాడు. కానీ, ఒక్క నెల ఈఎంఐ కట్టకపోవడంతో ఫైనాన్స్ సంస్థ ఉద్యోగి, బాధితుని ఇంటికి వచ్చి గొడవ పెట్టుకున్నాడు. ఈ క్రమంలో హెల్మెట్‌తో లక్ష్మణ్‌రావు పై దాడి చేశాడు. ఈ ఘటనపై సదరు ఉద్యోగిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.