calender_icon.png 26 January, 2026 | 5:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైడ్రాకు రూ.25లక్షల ఎంపీలాడ్స్

30-08-2024 01:52:01 AM

 కమిషనర్ రంగనాథ్‌ను కలిసిన ఎంపీ అనిల్‌కుమార్  

హైదరాబాద్, ఆగస్టు 29 (విజయక్రాంతి): ఎంపీ లాడ్స్ నంచి రూ. 25 లక్షలు కేటాయిస్తూ హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు రాజ్యసభ ఎంసీ అనిల్‌కుమార్ యాదవ్  లేఖను అందజేశారు. గురువారం బుద్ధభవన్‌లో హైడ్రా కమిషర్‌ను ఎంపీ అనిల్ కలిశారు. హైడ్రాకు ఖర్చుల కోసం ఎంపీ లాడ్స్ నిధులను కేటాయించినట్లు ఆయన తెలిపారు. బీఆర్‌ఎస్ హయాంలోనే ఎక్కువగా చెరువులు, కుంటలు కబ్జాలకు గురైయ్యాయని అనిల్ ఆరోపించారు. భవిష్యత్ తరాల గురించి సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచించి.. అక్రమాల కూల్చివేతలకు హైడ్రాను ఏర్పాటు చేశారని తెలిపారు. అక్రమ కట్టడాలు చేపట్టిన వారెవరయినా హైడ్రా వదిలిపెట్టబోదన్నారు. డ్రగ్స్ నివారణపై కూడా రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. హైడ్రాను జిల్లాలకు కూడా విస్తరించాలని కోరారు.