calender_icon.png 30 December, 2025 | 4:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యం

30-12-2025 12:00:00 AM

పలు సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడిన వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

వనపర్తి, డిసెంబర్ 29 (విజయక్రాంతి) : శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సోమవారం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశంలో వనపర్తి నియోజకవర్గంలోనీ పలు సమస్యలను సభా దృష్టికి వనపర్తి శాసనసభ్యులు  తూడి మేఘారెడ్డి తీసుకెళ్లారు. అందులో ప్రధానంగా వనపర్తి మండలం నాగవరం, రాజనగరం గ్రామ శివారులలోని రెవిన్యూ భూములకు సంబంధించిన కొన్ని సర్వేనెంబర్లు పొరపాటున దేవాదాయ భూములుగా  నమోదై ఉన్నాయి వాటిపై దేవాదాయ మరియు రెవెన్యూ శాఖ అధికారులు సంయుక్త సమావేశ నిర్వహించి సమస్య  పరిష్కరించాలని కోరారు.

వనపర్తి బైపాస్ రోడ్డు నిర్మాణానికి సంబంధించిన సమస్య సైతం ఈ రెండు శాఖల మధ్యనే నెలకొని ఉంది దాన్ని కూడా వెంటనే పరిష్కరించాలని కోరారు. ఖాన్ చెరువు నిర్మాణానికి సంబంధించిన 600 మీటర్ల పొడవు కాలువ నిర్మాణం సైతం ఫారెస్ట్ క్లియరెన్స్ కోసం ఆగి ఉందని వెంటనే దానిపై దృష్టి సారించి క్లియర్ చేయించారని ఆయన కోరారు.

ఆముదాల బండ తండాలో  ఇందిరమ్మ ఇంటి నిర్మాణాల సమస్య, పంచాయతీరాజ్ శాఖ రోడ్ల నిర్మాణం, రెన్యువల్  సమస్యల పరిష్కారం గురించి కోరారు. పెబ్బేరు మండల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు, పెబ్బేరు సంత కు సంబంధించిన ఫైల్స్ ప్రభుత్వం వద్ద ఉన్నాయని వాటిని పరిశీలించి వెంటనే పరిష్కరించాలన్నారు. వనపర్తి పట్టణ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని పట్టణానికి 50 కోట్ల రూపాయలను మంజూరు చేయాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. గొల్లపల్లి రిజర్వాయర్ మరియు బుద్ధారం స్టేజ్ 2 రిజర్వాయర్ దాంతోపాటు ఘనపురంలోని గణప సముద్రం రిజర్వాయర్ ఏర్పాటులో భూములు పాల్గొని రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని ఆయన కోరారు.