16-08-2024 02:44:18 AM
కామారెడ్డి, ఆగస్టు 15 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో ఆర్డీవో బూట్లు అటెండర్ మోసిన వ్యవహారం రచ్చకెక్కింది. జాతీయ జెండా సాక్షిగా జరిగిన ఈ అవమానకర ఘటనపై పలువురి విమర్శలు గుప్పిస్తున్నారు. తెలిసిన వివరాల ప్రకారం.. బాన్సువాడ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయ అవరణలో గురువారం జరిగిన స్వాతంత్రదినోత్సవ వేడుకలకు ఆర్డీవో రమేష్ రాథోడ్ హాజరయ్యారు. ఆయన బూట్లు వేసుకునే వేదిక ఎక్కడంతో సభికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఆర్టీవో జెండా గద్దె పక్కనే బూట్లు విప్పారు. అనంతరం జెండా ఎగురవేశారు. ఇదే సమయంలో అక్కడే ఉన్న అటెండర్ ఆర్డీవో బూట్లను మోసుకుంటూ తీసుకెళ్లాడు. దీనిపై ఆర్డీవో రమేష్ రాథోడ్‌ను వివరణ కోరగా.. తాను అటెండర్‌ను బూట్లు మోసుకెళ్లమని చెప్పలేదన్నారు.